బరువు తగ్గడం: ఇలాంటి పొరపాట్లు లేకుండా చూసుకుంటే తొందరగా బరువు తగ్గడం సాధ్యమే.

-

బరువు తగ్గడం అన్న మాట రాగానే డైట్ మీదకే ఆలోచన పోతుంది. ఆకలిని చంపుకుని అన్నం తక్కువగా తిని బరువు తగ్గాలని చూస్తారు. కానీ ఇలా ఎక్కువ రోజులు ఉండలేక డైట్ పాటించడంలో విఫలం చెందుతారు. డైట్ లో చేసే చిన్న చిన్న పొరపాట్లు తొందరగా బరువు తగ్గకుండా చేస్తాయి. అందుకే అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సలాడ్లు, ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడం నిజమే. కానీ సలాడ్లలో కొందరు కొందరు ఉపయోగించే ఆయిల్స్ కారణంగా దాన్నుండి వందశాతం లాభాలు పొందలేకపోతున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్త పడండి.

మీ పిల్లల ప్లేట్లో నుండో లేదా స్నేహితుల, భాగస్వాముల కంచంలో నుండే తీసుకునే ఆహారాలు మీ డైట్ ప్లాన్ ని భంగం కలిగిస్తాయి. ఇక్కడ అసలు అలా తీసుకోకూడదని కాదు. కానీ అలా తీసుకోవడం రోజూ అయ్యేలా చేసుకోకండి.

వ్యాయామం చేయకుండా పొద్దస్తమానం బెడ్ మీదే పడుకుని బరువు తగ్గడం లేదని ఎలా అనుకుంటారు. చెమట చిందించాలి. అలా అని పొద్దున్న లేవగానే జిమ్ లోకి వెళ్ళాలని కాదు. కనీసం ఇంట్లో అయినా అటూ ఇటూ నడుస్తూ ఉండి శరీరాన్ని కదలిక చేస్తుంటే సరిపోతుంది.

పండ్లు తినడం మంచిదే. కానీ ఆ తినడం మరీ ఎక్కువైతే శరీర బరువు కూడా పెరుగుతుంది. కాబట్టి ఏదైనా అతి చేయరాదని అర్థం.

మరేం చేయాలి?

ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నారనేది చెక్ చేసుకుంటూ ఉండండి. బరువు తగ్గడంలో దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

మెల్లగా తినండి. ఎక్కువ సేపు నమలండి. ఫోన్ చూస్తూ, టీవీ ముందు కూర్చుని, పక్కన వారితో మాట్లాడుతూ తినడం మానుకోండి.

మీ ఆకలిని అర్థం చేసుకోండి. కడుపు నిండుగా తినవద్దు. 80శాతం తిని 20శాతం ఖాళీగా ఉంచుకునేలా చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news