బ్లాక్ టీ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా ..?

-

గ్రీన్ టీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీన్ టీ తాగాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, వుంటాయని ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తుంటారు. కానీ గ్రీన్ టీ కన్నా బ్లాక్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎవరు ఊహించరు. ఈ టీ తాగడం వల్ల మారుతున్న సీజన్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ సీజన్ లో అసాధారణ ఉష్ణోగ్రత వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్ లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిని బ్లాక్ టీ చాలా ఉపయోగపడుతుంది.కావున బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే ఉపయోగలేంటో తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది..
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. కానీ బ్లాక్ టీ యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.ఈ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఈ బ్లాక్ టీలో ఉండే కెఫిన్ శరీరంలో శక్తి ప్రసరణకు ఎంతో సాయపడుతుది.

క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది..
బ్లాక్ టీ లో పాలీఫెనాల్స్‌ ఉండటం వల్ల క్యాన్సర్ కలిగించే ప్రీ ర్యాడికల్స్ ని నాశనం చేస్తుంది . కాబట్టి కణితి పెరుగుదలను నివారిస్తుంది. చర్మం, రొమ్ము, ఊపిరితిత్తులకు కలిగే ప్రోస్టేట్ క్యాన్సర్ నివారిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..
బ్లాక్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. బ్లాక్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకొనే అవకాశం ఉంటుంది.ఇది అధిక బీపీ , చెడు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం పరగడుపున బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఔషదనంగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news