క్యారెట్ జ్యూస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..?

-

క్యారెట్ ఇందులో ఉండే సుగుణాలు బహుశా మరొక వెజిటేబుల్ లో ఉండవేమో… క్యారెట్ ని వంటకంతో గాని,జ్యూస్ తో గాని, పచ్చగా గాని తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ,బి, సి, ఇ లతోపాటు పొటాషియం,మెగ్నీషియం,సోడియం, మంగనీస్, ఐరన్, అయోడిన్ మరియు శరీరానికి ఎంతో ఉపయోగపడే కాల్షియం ఉన్నాయి.ఇది మన శరీరాన్ని అనేక రుగ్మతల నుండి కాపాడుతుంది.అంతే కాకుండా క్యారెట్ లో అందాన్ని మరియు ఆరోగ్యాన్ని పెంచే అనేక గుణాలున్నాయి.

గుండెకు మంచిది :
క్యారెట్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటును కంట్రోల్లో ఉంచడం ద్వారా గుండె జబ్బును నివారిస్తుంది.

కళ్ళకు మంచిది :
సహజంగానే క్యారెట్ కళ్ళకు మంచిదని అంటుంటారు.
ఇందులో ఉండే విటమిన్ ఎ అన్ని రకాల కంటి సమస్యలను దూరం చేస్తుంది.రోజు క్యారెట్ ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది :
క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు క్యాన్సర్ ను నిరోధించే గుణాన్ని కూడా కలిగి ఉంది. దీర్ఘకాలిక సమస్యలను కూడా చెక్ పెడుతుంది.

వెంట్రుకల ఆరోగ్యానికి :
క్యారెట్ మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. రోజు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా కుదుళ్లు గట్టి పడుతాయి.వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంటాయి.జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

చర్మ సౌందర్యానికి :
క్యారెట్ లోఉండే విటమిన్ ఇ మన చార్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో ఏర్పడే మృత కణాలను తిరిగి పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వలన నిగనిగలాడే చర్మం మన సొంతం చేసుకొనవచ్చు.

నిద్రలేమిని తగ్గిస్తుంది :
నిద్రలేమితో బాధపడే వారికి క్యారెట్ ఒక చక్కని మందు లాంటిది.క్యారెట్ జ్యూస్ని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. అలాగే ఇది మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది.

అంతేకాకుండా…… పురుషుల్లో వీర్య వృద్ధిరేటును పెంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్యలను దూరం చేస్తుంది.జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పచ్చి క్యారెట్ ను రోజు తినడం వల్ల పళ్ళు గట్టి పడతాయి.జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.రోజు క్యారెట్ ని తినడం వల్ల అందాన్ని మరియు ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news