Breaking : సమంత అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘శాకుంతలం’ ఫస్ట్‌ సింగిల్‌ డేట్‌ లాక్‌

-

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటించిన సినిమా “శాకుంతలం”. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇవాళ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే తాజాగా మరో అప్డేట్‌ ఇచ్చారు చిత్రయూనిట్‌. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. అయితే.. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18వ తేదీన ‘మల్లిక .. ‘ అంటూ సాగే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ, కొంతసేపటి క్రితం అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఫస్టు సింగిల్ ను వదలనున్నారు. శకుంతల పాత్రను సమంత పోషించగా, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ పరిచయం కానున్నాడు. మోహన్ బాబు.. ప్రకాశ్ రాజ్ .. అనన్య నాగళ్ల ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news