మొక్కజొన్న పొత్తులు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

-

చల్ల చల్లగా వర్షం పడుతుంటే మొక్కజొన్న పొత్తులను కాల్చుకొని కానీ, వుండకబెట్టుకొని కానీ తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది కదా..ఏ సీజన్ లో దొరికే పండ్లు, కాయలు ఆ సీజన్ లోనే తినాలి. అప్పుడే అందరు ఆరోగ్యాంగా ఉంటారు.

వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో మొక్కజొన్న పొత్తులు ముఖ్యమైనవి. ఇందులో చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. అందుకే పూర్వం రోజుల్లో వీటిని తినడం వల్లే మన పెద్దలు మంచి ఆరోగ్యంతో.. ఎంత వయసు వచ్చినా వారి పనులు వారు చేసుకొనేవారు.కావున మనం కూడా వీటిని తరుచుగా తింటూ వుంటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

మొక్కజొన్నలను కాల్చికాని, ఉడకబెట్టి కానీ,పాప్ కార్న్ గా,స్వీట్ కార్న్ గా చేసుకొని తింటు వుంటాము. మొక్కజొన్నతో రొట్టె కూడా చేస్తారు . మొక్కజొన్న గింజల నుంచి నూనె తీస్తారు.మొక్కజొన్నలో ఎన్నో పోషక విలువలున్నాయి.ఇందులో ఎముకలకు కావాల్సిన క్యాలిషియం, మినరల్స్ పుష్కలంగా దొరుకుతాయి. మెగ్నిషియం, ఐరన్, కాపర్, పాస్పరస్ వంటివి ఉండటంతో ఎముకలకు బలాన్నిస్తాయి. మొక్కొజొన్న తో చేసిన పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు మరింత గట్టిపడతాయి.

మొక్కజొన్న తరుచుగా తీసుకుంటూ వుంటే జీర్ణక్రియను బాగా జరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే అధిక పైబర్, పొంథోటైమిక్ అనే హార్మోన్ వల్ల ఆహారం తొందరగా జీర్ణం అవడానికి తోడ్పడుతుంది. దీని ద్వారా మలబద్ధకం, పేగు క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తవు. అందుకే మొక్కజొన్నను ఆహారంగా తీసుకుంటే దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు.

ఇందులో యాంటిఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.సాధారణంగా ఐరన్ లోపంతో రక్తకణాల సంఖ్య తగ్గిపోతుంటుంది . దీంతో మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటంతో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు రక్తహీనత రాకుండా చేస్తుంది.వీటితో పాటు మొక్కజొన్నను ఆహారంగా తీసుకుంటే మనకు విటమిన్ ఎ,బి,సి,ఈలు కూడా దొరుకుతాయి.మొక్క జొన్నలో రక్తంలో కొలేస్ట్రాల్ ను కరిగించే గుణం ఉంటుంది. ఇందువల్ల గుండె సమస్యలు, బిపి, షుగర్ వంటివి రాకుండా కాపాడుతుందనీ ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news