డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి పండ్లు తినాలో తెలియక తికమకపడుతున్నారా?

-

షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు.. ఏం తినాలి, ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. కనీసం పండ్లు తినాలన్నా భయపడుతుంటారు. అలాంటివారు ఈ పండ్లను మాత్రం ఆలోచించకుండా తినవచ్చు. అవేం పండ్లో చూద్దాం.

యాపిల్ : వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు. కాబట్టి మధుమేహులు ఈ పండ్లని తినడం ముఖ్యం.

ద్రాక్షపండ్లు : రక్తప్రసరణను మెరుగుపరుచడంలో ద్రాక్షపండ్లు ముందుంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని కొవ్వుశాతం తగ్గుతుంది.

దానిమ్మపండు : ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కల్పిస్తాయి. ఇందులో చక్కెర నిల్వలు స్వల్పంగా ఉంటాయి. కాబట్టి మధుమేహులు ఈ పండ్లను తినొచ్చు.

పుచ్చకాయ : వీటిలో ైగ్లెసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహులకు అంతమంచిది కాదు. కానీ, ఇందులోని పొటాషియం కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండుని తీసుకోవచ్చు.

నారింజ : విటమిన్ సి కలిగిన పండ్లు డయాబెటిస్ పేషెంట్లకి ఎంతో మంచిది. అందువల్ల కమలా పండ్లు ముఖ్యంగా తీసుకోవాలి.

పియర్స్ : ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్న పండ్లు డయాబెటీస్‌కి చాలా మంచిది. అయితే, పియర్స్ అనే పండ్లలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తినడం చాలా మంచిది.

నేరేడుపండ్లు : ఈ పండ్లని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. కేవలం ఈ పండ్లే కాదు, వీటి గింజలను పౌడర్ చేసుకొని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

జామపండు : వీటిలో విటమిన్ ఎ, సి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ పండ్లు మధుమేహులకు చాలా మంచివి.

పైనాపిల్ : యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్న పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అంజీర్ లేదా ఫిగ్ : ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అంజీరా పండ్లు ఇన్సులిన్ ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లని తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news