మామిడి పండ్లను తినే ముందు అరగంట పాటు నీళ్ళల్లో ఎందుకు ఉంచాలంటే..?

-

వేసవి వస్తోందంటే అందరూ ఎదురు చూసేది మామిడిపండ్ల కోసమే. మామిడి పండ్లు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. మనకి వివిధ రకాల మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి. పైగా మామిడి పండ్లు తో మనం మనకు నచ్చిన రెసిపీస్ ని కూడా తయారు చేసుకోవచ్చు. అయితే మామిడి పండ్లను తినడానికి అరగంట ముందు నీళ్లల్లో నానబెట్టి తినమని చెప్తూ ఉంటారు. ఎందుకు ఇలా ఫాలో అవ్వాలి…?, తినడానికి అరగంట ముందు మామిడిపళ్లని నానబెట్టడం అవసరమా..? దీని వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

 

చర్మ సమస్యలు ఉండవు:

మామిడి పండు తినడానికి అరగంట ముందు నీళ్ళల్లో నానబెడితే ఇది చర్మానికి సమస్యలు తీసుకోరాదు. కొంతమందికి మామిడి పండ్లు తింటే పింపుల్స్, యాక్ని వంటి సమస్యలు వస్తాయి. నానబెట్టి తింటే ఈ సమస్య ఉండదు. అలానే కాన్స్టిపేషన్, తలనొప్పి వంటి సమస్యలు కూడా నానబెట్టి తీసుకోవడం వల్ల ఉండదు. ఇలా చేయడం వల్ల వేడి తగ్గుతుంది.

కెమికల్స్ దాని నుంచి బయటకు వెళ్లిపోతాయి:

మామిడి పండ్లను కెమికల్స్ వేసి ముగ్గపెడుతూ ఉంటారు అయితే ఆ కెమికల్స్ ని మనం తీసుకున్నట్లయితే దాని వల్ల ఇబ్బంది పడాలి. దీని వల్ల తలనొప్పి, వికారం వంటి సమస్యలు కూడా కలగవచ్చు. అందుకని నానబెట్టిన మామిడి పండ్లను తీసుకుంటే కెమికల్స్ పోయి సమస్యలు ఉండవు.

కొవ్వు కరుగుతుంది:

మామిడి పండ్లలో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి అయితే నీళ్ళల్లో మామిడి పండ్లను వేస్తె నీటిని అబ్సర్బ్ చేస్తాయి. దీనితో కాన్సెంట్రేషన్ తగ్గుతుంది ఇలా కొవ్వు అనేది తగ్గుతుంది. అలాగే సరైన టెంపరేచర్ లో మామిడి పండ్లను తీసుకుంటే థెర్మోజెనిక్ ప్రొడక్షన్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news