రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్… దేశ సంపదను దోచుకోవడమే టార్గెట్: తరుణ్ చుగ్

-

రాహుల్ గాంధీ థీమ్ ఒక్కటే అని దేశ సంపదను దోచుకోవడం అని విమర్శించారు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా 12 లక్షల కోట్లను లూటీ చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అని… దేశ సంపదను దోచిన పార్టీ ఇంకా ఖతం అవ్వలేదని ఆయన విమర్శించారు. డ్రామాలు తప్పా రైతులు కష్టాలపై చింత లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశానికి ఉపయోగపడే ట్వీట్ల కన్నా విదేశాలకు ఉపయోగపడే ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇతర దేశాాలు ఎలా పర్యటిస్తారో… తెలంగాణలో కూడా అదే విధంగా పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాందీకి తెలంగాణలో పెద్దగా ప్రాధాన్యత లేదని తరుణ్ చుగ్ అన్నారు. దేశంలోని ముస్లింలు, జైన్లు, హిందువులు, బుద్ధులు, సిక్కులు ప్రతి ఒక్కరూ మోడీకి అండగా ఉన్నారని అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ జిన్నా అవ్వాలని పరితపిస్తున్నాడని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్, టీఆర్ఎస్ కి బీ టీమ్ గా ఓవైసీ పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ముస్లింల చేతిలో ప్రాణాలు కోల్పోయిన దళిత కుటుంబానికి చెందిన వ్యక్తికి న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ ను కోరామని…హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామంటే ఓవైసీ ఎందుకు భయపడుతున్నారని… ఎవరిని కాపాడటం కోసం ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news