పాలు తాగడం అనే అలవాటు చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. చిన్నప్పుడు అంటే అమ్మ నాలుగు తన్నీ మరీ డైలీ పాలు ఇచ్చేది. ఇప్పుడు అలా కాదు.. మన ఇష్టం ఉంటేనే తాగుతాం. పాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు..అలాగే స్కిన్‌కు కూడా చాలా మంచిది.. కానీ వచ్చిన చిక్కల్లా పాలు తాగితే బరువు పెరిగిపోతామో అనే భయం. ఇప్పుడున్న రోజుల్లో బరువు ఎలా తగ్గాలిరా దేవుడా అని బాధపడుతుంటే మళ్లీ ఈ పాలు తాగితే ఇంకా ఏఢ బరువు. పెరిగేది అని చాలామంది తమకు ఇష్టమున్నా పాలు తాగడం లేదు. కానీ ఇలా చేస్తే పాలు తాగడం వల్లే సన్నగా అవ్వొచ్చు.. ఎలా అంటే..
వ్యాయామం తర్వాత పాలు తాగడం వల్ల సన్నని కండరాలను నిర్మించడంలో, శరీర కూర్పును మెరుగుపరచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వెన్న తీయని పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ పాలను తాగితే బరువు పెరుగుతారు. అదే వెన్న తీసిన పాలు అయితే వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కనుక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు వెన్న తీసిన పాలు తాగడం బెటర్.. గేదె పాలు కంటే ఆవు పాలలో తక్కువ కొవ్వు ఉంటుంది. ఆవు పాలను తేలికైన పాలు ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఆవు పాలలో కొవ్వు 3-4 శాతం ఉంటే, గేదె పాలలో 7-8 శాతంతో అధికంగా కొవ్వు ఉంటుంది. ఆవు పాలు కంటే గేదె పాలలో ప్రోటీన్లు 10-11 శాతం అధికంగా లభిస్తాయి.
ఎవరు ఏ పాలు తాగాలి..?
పాలు తాగడం వల్ల శరీర కండరాలకు చాలా విశ్రాంతి లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా పాలను డైలీ తాగొచ్చు.. మన శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలను పాలు అందిస్తాయి. చిన్నారులకు ఆవు పాలు తాగించాలి. యుక్త వయస్సులో ఉండేవారు టోన్డ్ మిల్క్ తాగాలి. అదే పెద్దలు అయితే స్కిమ్మ్‌డ్ మిల్క్ తాగాలి.
పాలు తాగితే గ్యాస్ సమస్య వస్తుందా..?
పాలు త్వరగా జీర్ణం కావు. అయితే అందిరిలో ఈ సమస్య ఉండదు. పాలలో ఉండే లాక్టోస్ అనే పదార్థం వల్ల కొందరికి పాలు జీర్ణం కావు. దీంతో గ్యాస్, అసిడిటీ వస్తాయి. దీన్నే లాక్టోస్ ఇన్‌టోలరెంట్ అని పిలుస్తారు. ఈ సమస్య కేవలం కొందరికి మాత్రమే వస్తుంది. పాలు జీర్ణం అయ్యే వారు వాటిని నిర్భయంగా తాగవచ్చు.