చలికాలంలో దగ్గు, జలుబు ఉండకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

చలికాలం వచ్చిందంటే చాలా మంది జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో బరువు బాగా పెరిగి పోతున్నారు చాలామంది. అయితే ఈ మూడు సమస్యలకు పరిష్కారం జామకాయలో ఉంది. నిపుణులు జామకాయని తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు.

చలికాలంలో దీన్ని తీసుకుంటే మరెంత మేలు కలుగుతుంది. జామకాయ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, పొటాషియమ్, ఫైబర్ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. 80 శాతం వరకు నీళ్లు మనకి జాములో ఉంటాయి. దీంతో చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.

జామకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలానే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. జామ ఆకు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. జామ ఆకులతో టీ తీసుకుని తాగడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అని నిపుణులు అంటున్నారు.

అలానే గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ఫ్రీరాడికల్స్ నుండి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. జామ ఆకులు బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తాయి. అలానే మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

అలాగే ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. దీనితో బరువు తగ్గడానికి అవుతుంది. కాన్స్టిపేషన్ తో బాధపడే వాళ్లకు కూడా జామకాయ బాగా మేలు చేస్తుంది. కడుపుని శుభ్రపరచడానికి జామ గింజలు బాగా ఉపయోగపడతాయి. ఇలా చలికాలంలో జామ తీసుకోవడం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అదే విధంగా సమస్యల నుండి బయట పడే ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news