కొంతమందికి ముక్కుపైన చిన్న చిన్న మచ్చలు వస్తుంటాయి. బ్లాక్ స్పాట్స్ లాంటివి. వీటిని తగ్గించుకోవడానికి మనం చాలా చేస్తుంటాం. అసలు ఇవి ఎందుకు వస్తాయి..సహజంగా వీటిని ఏం చేస్తే తగ్గించుకోవచ్చో ఈరోజు చూద్దాం.

నలుపువర్ణాన్ని తగ్గించడానికి, మెలనోసైట్ కణజాలం యొక్క స్టిమ్యులేషన్ తగ్గించడానికి తేనె బాగా పనికొస్తుంది. ఒరిజనల్ తేనె తీసుకుని..రోజుకు రెండు మూడుసార్లు ముక్కుమీద రాసుకుని మర్దన చేస్తూ ఉండండి. 5-10 నిమిషాలు అలా మర్ధన చేసుకుని..గంటపాటు అలా ఉంచండి. ఈ తేనెలో ఉండే అనేక రకాల ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం..మెలనోసైట్స్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. నలుపు ఉత్పత్తిని ఆపుతుంది.

ఈ చిట్కాలతోపాటు..డైలీ ఉదయాన్నే సిట్రస్ ఫ్రూట్ జ్యూస్‌లు తాగితే మరీ మంచిది. ఇవి యాంటిఆక్సిడెంట్ జ్యూస్‌లు అంటారువీటిని..మన శరీరంలో కణజాలం ఇన్ఫెక్షన్ భారిన పడినప్పుడు కోలుకోవడానికి, ఆ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గడానికి, స్కిన్ హెల్తీగా ఉంచడానికి వీటమిన్ సీ, ఏ బాగా ఉపయోగపడతాయి. వీటికోసం సిట్రస్ జ్యూస్ తాగటం చాలా మంచిది. పొద్దున లేదా సాయంత్రం బత్తాయి, కమలా జ్యూస్ లాంటివి తాగుతూ ఉంటే..స్కిన్ హెల్తీగా ఉంటుంది.

ఉదయంపూట విటమిన్ A బాగా అందాలంటే..కీరాదోసకాయ, టమాటా జ్యూస్ రెగ్యులర్‌గా తాగండి. ఈ జ్యూస్‌లో కొత్తిమీర, కరివేపాకు, పుదినా కూడా వేసి తాగగలిగితే..నాచురల్‌గా నోస్ మీద వచ్చే బ్లాక్ స్పాట్స్‌ను కంప్లీట్‌గా తొలగించుకోవచ్చు. స్కిన్ కూడా ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. విటన్నింటికంటే..ముఖ్యంగా మంచినీళ్లు బాగా తాగండి. ఎండకు వెళ్లినప్పుడు..ఆ అల్ట్రావైరస్ రేస్‌కి స్కిన్‌ని ఇరిటేట్ చేయకూడదంటే..నీళ్లు బాగా తాగాలి. నీళ్లు సరిపడా తాగితే..హీట్ నుంచి స్కిన్‌లో ఉండే వాటర్ రక్షిస్తుంది. అందుకే శరీరానికి సరిపడా 4లీటర్ల నీరు ఒక రోజుకు అందించాలని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు అంటున్నారు.
Triveni Buskarowthu