తగ్గదే లే అంటున్న కిమ్.. ఒకే నెలలో 7 క్షిపణి ప్రయోగాలు

-

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ తగ్గేదే లేదు అంటున్నాడు. వరసగా క్షిపణులను ప్రయోగిస్తూ ప్రపంచానికి సవాల్ విసురుతున్నారు. ఒక్క జనవరి నెలలోనే ఇప్పటి వరకు 7 క్షిపణులను పరీక్షించి ఉత్తర కొరియా. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఆందోళనలను లెక్క చేయకుండా వరసగా క్షిపణులను పరీక్షిస్తోంది. తాజాగా మరో మిసైల్ ని పరీక్షించింది. దాదాపుగా 2 వేల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని… కొరియా ద్వీపకల్ప- జపాన్ మధ్య సముద్రంలో కూలిపోయింది. యూఎన్ ఓ విధించిన ఆంక్షలకు ఇది పూర్తిగా విరుద్ధం.. అయినా నార్త్ కొరియా తగ్గడం లేదు. మరో పక్క ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సైనికుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నామని అంటున్నారు. ఇదిలా ఉంటే నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలు సరిహద్దు దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో పాటు వీటి మిత్ర దేశమైన అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ప్రయోగించిన మిసైల్ యుఎస్ భూభాగమైన గువామ్‌ను చేరుకోగల ఒక ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అని తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news