సరిపడా నిద్ర లేదని.. ఈ 5 చూసి చెప్పవచ్చు..!

-

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని అలవాట్లు ఉండాలి. సరిపడా నిద్ర, శరీరానికి సరిపడా నీళ్లు, మంచిగా ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం ఇలా ఎన్నో.. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. మంచి నిద్రని పొందితే కచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాము కానీ ఈ రోజుల్లో చాలా మంది తక్కువ సేపు నిద్రపోతున్నారు. నైట్ డ్యూటీ, ఫోన్ లోనే సమయాన్ని గడపడం వంటి కారణాలు వలన నిద్రపోవట్లేదు.

సరైన నిద్ర లేదని ఎలా తెలుసుకోవచ్చు అనే విషయానికి వచ్చేస్తే… సరైన నిద్ర లేకపోతే మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. దేనిని గుర్తు పెట్టుకోలేక పోతారు. జ్ఞాపకశక్తి బాగా తగ్గుతుంది రోగనిరోధక శక్తి కూడా బాగా తగ్గిపోతుంటుంది. మంచి నిద్ర ఉంటే రోగినిరోధక శక్తి కూడా బాగుంటుంది. అదే మంచి నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సరిపడా నిద్ర లేకపోతే కచ్చితంగా మూడ్ కూడా పాడవుతుంది. డిప్రెషన్ వంటి ఇబ్బందులు కూడా వస్తాయి సరిపడా నిద్ర లేకపోవడం వలన ఫిజికల్ పెర్ఫార్మెన్స్ కూడా బలహీనంగా ఉంటుంది.

సరిపడా నిద్ర లేకపోతె మనం బరువు పెరిగిపోతాం కూడా. సరైన నిద్ర లేకపోతే క్రేవింగ్స్ బాగా పెరిగిపోతాయి. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం, బాగా బరువు పెరిగిపోవడం జరుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. హై బీపీ, ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్ వంటి ఇబ్బందులు కలుగుతాయి ఇలా వీటి బట్టి మనం సరైన నిద్ర లేదని చెప్పచ్చు. కాబట్టి వీలైనంత సేపు నిద్రపోండి ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news