ఒక్క మస్కిటో కాయిల్… 100 సిగిరెట్లు తాగడంతో సమానమట..!

-

మస్కిటో కాయిల్: దోమలు లేని ఇళ్లు ఉండదేమో.. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. సాయంత్రానికి వచ్చేస్తాయి. పులులు, సింహాలు కంటే దోమలు చాలా డేంజర్‌.దోమలు నుంచి తప్పించుకోవడానికి.. చాలా మంది మస్కిటో కాయిల్స్‌ వాడతారు. దాన్ని వెలిగించి వదిలేస్తే ఆ మస్కిటో కాయిల్ నుండి వచ్చే పొగ భరించలేక దోమలు బయటకు పోతాయి. కానీ ఆ పొగ వల్ల ఇంట్లోని మనుషులకు తీవ్ర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఆ పొగ 100 సిగరెట్లు కాల్చడంతో సమానమని చెబుతున్నారు సైంటిస్టులు. కాబట్టి ఇంట్లో మస్కిటో కాయిల్స్ వాడడం మానుకుంటేనే మంచిది.

 

మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగను పీల్చే వ్యక్తులకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనారి డిసీజ్ (COPD) వచ్చే అవకాశం ఎక్కువనే చెబుతున్నారు వైద్యులు. ముంబైలో ప్రతిరోజు ఆరుగురు వ్యక్తులు ఈ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధికి కారణమై ప్రాణాలు కోల్పోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. 2019లో COPD కారణంగా మన దేశంలో ప్రతి లక్ష మందిలో 98 మంది మరణించినట్టు అంచనా. ధూమపానం అలవాటు ఉన్నవారు అధికంగా ఈ వ్యాధి బారిన పడతారు. కానీ ధూమపానం అలవాటు లేని వారు కూడా మస్కిటో కాయిల్స్ కారణంగా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం.. ఏటా 4.3 మిలియన్ల మంది మరణాలకు ఇంట్లో ఉండే కాలుష్యమే కారణం.

మస్కిటో కాయిల్స్ కాల్చడం వల్ల ఉత్పత్తి అయ్యే పర్టికులేట్ అనే పదార్థం 75 నుంచి 137 సిగరెట్లు కాల్చడానికి సమానమని ఒక అధ్యయనం చెప్పింది. ఇది అనారోగ్యానికి కారణమవుతుందని వివరించింది. మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగ శ్వాసకోశ సమస్యలను పెంచుతుందని వివరించింది. మస్కిటో కాయిల్స్‌ను రోజూ కాల్చడం వల్ల ముఖ్యంగా రాత్రి నిద్రపోతున్నప్పుడు కాల్చడం వల్ల ఆ పొగ గదిలోనే ఉంటుంది.. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. నిద్ర సరిగ్గా పట్టదు.. చాలామంది ఈ పొగ నచ్చదు.. అయినా దోమల నుంచి తప్పించకునేందుకు తప్పక వెలిగిస్తుంటారు.. కళ్ళు మంటలు, ఎరుపెక్కడం వంటివి జరుగుతుంది. ఆస్తమా ఉన్నవారికి ఈ పొగ చాలా ప్రమాదకరం. వికారం వాంతులు వచ్చే అవకాశం ఉంది. దగ్గు, గురక, తుమ్ములు వంటివి వస్తూ ఉంటాయి. గొంతు నొప్పి వంటివి కూడా రావచ్చు. చాలా గంటలు పాటు ఈ పొగను పీల్చినట్టయితే ఊపిరాడదు.. రక్తంలో ఈ వాయువులు కలిసి గుండె వరకు చేరితే ప్రాణాంతక పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా గర్భిణులు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు, పిల్లలు ఈ పొగను పీల్చడం చాలా ప్రమాదకరం.

Read more RELATED
Recommended to you

Latest news