ఈ రాశుల వారు పరమ పిసినారులు.. ఖర్చుపెట్టేముందు వెయ్యిసార్లు ఆలోచిస్తారట..! 

మనిషిని నడిపించేది డబ్బే..మనీ మేక్స్ మెనీ రిలేషన్స్ అని ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది. చాలా మంది ఇది నమ్ముతుంటారు కూడా. ఈ ప్రపంచం మొత్తం నడిచేది డబ్బు మీదే.. అయితే ఈ మనీ విషయంలో ఒక్కొక్కరి ధోరణి ఒక్కోలా ఉంటుంది. కొందరు మన అవసరాలకు సరిపడా ఉంటే చాలు అనుకుంటారు..ఇంకొందరు..వెనక ఆస్థులు పోగేసుకుంటారు..మరికొందరు..ఉన్న డబ్బును దుబారాగా ఖర్చుచేయరు..ఒక్క రూపాయి ఖర్చుపెట్టాలంటే..వందసార్లు ఆలోచిస్తారు. అయితే రాశి ప్రకారం డబ్బు విషయంలో కొందరు పరమ పసినారిగా ఉంటారు. మరి అలాంటి వారు ఎవరో చూసేద్దామా..!
మేష రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు చాలా పిసినారులట. వీలైనంత ఎక్కువ డబ్బు ఆదా చేస్తారు. వాటిని ఖర్చు చేయరు. వేరొక చోట పెట్టుబడి పెట్టాలని చూస్తారు. ఎంతో డబ్బున్నా.. ఈ వ్యక్తులు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతారట.
కర్కాటకం: కర్కాటక రాశి వారు కూడా ఖర్చు పెట్టే ముందు వెయ్యి సార్లు ఆలోచిస్తారట. అదనపు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. చాలా ముఖ్యమైన వాటిపై మాత్రమే వీళ్లు ఖర్చు పెడతారు. ఎంతో అవసరం ఉంటేనే డబ్బులు బయటకు తీస్తారు. వీరి జేబులోంచి డబ్బులు రాబట్టడం చాలా కష్టమైన పనే.
కన్య: కన్యా రాశి వారు డబ్బు ఆదా చేయడంలో నిష్ణాతులు. నలుగురిలో వెళ్లినప్పుడు.. ఎక్కడైనా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే.. అక్కడి నుంచి సులభంగా తప్పించుకుంటారు. చాలా తెలివిగా ఖర్చు చేస్తారు. అంత ఈజీగా డబ్బులు బయటకు తీయరుగా.
మకరం: ఇక ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు. వారు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి.. మొత్తానికి చాలా డబ్బు సంపాదిస్తారు. ఐతే వృథా ఖర్చు మాత్రం అస్సలు చేయరు. ఈ వ్యక్తులు పెట్టుబడి పెట్టడంలో కూడా నిపుణులే. డబ్బును బాగా పొదుపు చేస్తారు. అందుకు వీరికి బ్యాంక్ బ్యాలెన్స్‌ ఎక్కువగా ఉంటుంది.
గమనిక: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
-Triveni Buskarowthu