ఏ రాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే…?

-

ఈరోజు జ్యోతిష్యులు రాశులు ఆధారంగా ఏ అనారోగ్య సమస్యలు వస్తాయో చెప్పారు. మరి ఏ రాశి వారికి ఏ సమస్యలు వస్తాయో ఇప్పుడే తెలుసుకోండి.

 

మేష రాశి:

మేష రాశి వారికి తల, మెదడు, ముఖం తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశివాళ్లకి ఎక్కువగా తల నొప్పి, గుండెపోటు సమస్యలు వస్తాయి. విపరీతమైన ఆలోచనలు కూడా వీళ్ళకి కలుగుతుంటాయి.

వృషభ రాశి:

మెడ, చెవులు మరియు గొంతు తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా థైరాయిడ్, కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అలానే జలుబు, గొంతు నొప్పి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి.

మిధున రాశి:

ఈ రాశి వాళ్ళకి భుజాలు చేతుల తో ముడిపడి ఉంటుంది. వీళ్ళకి శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఛాతి, కడుపు తో సంబంధం కలిగి ఉంటుంది. త్వరగా వీళ్ళు డిప్రెషన్ కి కూడా గురవుతారు.

సింహరాశి:

గుండె, వెన్ను, వెన్నెముక, రక్తం తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎక్కువగా బీపీ తో బాధపడతారు. గుండె సమస్యలు కూడా వస్తాయి.

కన్యారాశి:

పొత్తికడుపు, కడుపుతో వీళ్ళకి ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆహారపు అలవాట్లతో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.

తులారాశి:

మూత్రపిండాలు, అడ్రినల్ గ్రంథులు చర్మంతో సంబంధం కలిగి ఉంటుంది. తులా రాశి వాళ్లకు ఎక్కువగా చర్మ సమస్యలు కూడా వస్తాయి.

వృశ్చిక రాశి:

మూత్రాశయం సమస్యలు వస్తాయి. అలాగే లైంగికంగా సంక్రమించే వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వాళ్ళు కాళ్లు, తొడలు మొదలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన చికిత్స కలిగించడం చాలా ముఖ్యం.

మకర రాశి:

మకర రాశి వారికి ఎముకలు, మోకాళ్ళు, దంతాలు, చర్మం మరియు కీళ్లతో సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కువగా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి.

కుంభరాశి:

కుంభ రాశి వారికి చీలమండలు మరియు రక్తప్రసరణలో ఇబ్బందులు ఉంటాయి. వీటి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది.

మీన రాశి:

మీన రాశి వాళ్ళల్లో నాడీవ్యవస్థ సంబంధం కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news