పట్టుదల ఉంటే వైకల్యం అడ్డుకాదని నిరూపించిన అమ్మాయి..సక్సెస్ స్టోరీ..

-

అన్నీ ఉండి కూడా జీవితంలో వెనుకబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు.. అలాంటి వాళ్ళకు కొందరు ఆదర్శంగా నిలుస్తున్నారు..ఇప్పుడు మనం చెప్పుకొనే అమ్మాయి కథ అందరికి కనువిప్పు కలిగిస్తుంది..వైకల్యం ఉన్నా కూడా అనుకున్న లక్ష్యాలను అందుకోవడం లో అడ్డుకాదని నిరూపించి అందరికి ముందు చూపు గా నిలిచింది.ఇక ఆలస్యం ఎందుకు ఆ అమ్మాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

12వ తరగతి పరీక్షల్లో 500 మార్కులకు 496 మార్కులను సొంతం చేసుకుంది.దేశంలోనే వికలాంగ విద్యార్థుల విభాగంలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది 19 ఏళ్ల హన్నా ఆలిస్ సైమన్. అంతేకాదు.. ఇప్పుడు ఉన్నత చదువులు చదివి.. తన కలలను సాకారం చేసుకోవడానికి అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లింది. అదీ కూడా స్కాలర్ షిప్ ను సొంతం చేసుకుని.. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళింది.
ఈమెకు కంటి చూపు లేదు..చదువుకు తన లోపం అడ్డంకాదు అనుకుంది. పట్టుదలతో చదివి.. USలోని ఇండియానాలోని నోట్రే డామ్ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించి. ఈ స్కాలర్ షిప్ ను గెలుచుకున్న ఏకైక కేరళీయురాలుగా హన్నా నిలిచింది. ప్రతిభావంతురాలైన హన్నా సైకాలజీలో అత్యుత్తమ కోర్సును అభ్యసించడానికి స్కాలర్‌షిప్‌ను పొందడానికి ఉపయోగపడిందని హన్నా తల్లి లిజా సైమన్ అన్నారు..హన్నా లండన్లోని ట్రినిటీ కాలేజ్ నుండి వెస్ట్రన్ వోకల్, క్లాసికల్, రాక్ రెండింటిలోనూ ఎనిమిదో తరగతి పూర్తి చేసింది, అంతేకాకుండా అనాథ పిల్లలతో కలిసి పని చేసింది.

ఇవన్నీ హన్నాకు యుఎస్ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్షకు అదనపు అర్హతగా నిలిచాయి. దీంతో నోట్రే డామ్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ లో అర్హత సాధించిన 14 మందిలో పూర్తి స్కాలర్‌షిప్ పొందిన ఏకైక విద్యార్థిగా హన్నా నిలిచింది..తాను అనుకున్న లక్ష్యాలను తన స్నేహితులు,తల్లిదండ్రుల సాయంతో చేరుకుంది..ఇప్పుడు అమెరికాలో చదువుల కోసం వెళ్ళింది. చిన్న చిన్న కారణాలతో నిరాశకు గురయ్యేవారికి హన్నా ఒక ఆదర్శ యువతి.. కళ్ళు లేకపోయినా మనసునే కళ్ళుగా చేసుకుని, తాను అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది..గ్రేట్ కదా..ఆల్ ది బెస్ట్ హన్నా..

Read more RELATED
Recommended to you

Latest news