తిరుపతిలో శివాజీ విగ్రహాలకు నో ఎంట్రీ.. జగన్‌ పై రాజాసింగ్‌ సీరియస్‌

-

జగన్ తీరుతో తిరుపతి, ఏపీకి చెడ్డ పేరు వస్తుందని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్ కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతుందని.. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాలపై ఇతర హిందూ దేవుళ్ళ స్టిక్కర్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్ తప్పుడు నిర్ణయాల వలన హిందూ దేవుళ్ళకు చెడ్డ పేరు వస్తుందని.. మహారాష్ట్ర భక్తులు తీసుకొస్తోన్న చత్రపతి శివాజీ విగ్రహాలను అనుమతించమని పోలీసులు చెప్తున్నారని సమాచారం అందుతోందని పేర్కొన్నారు.

శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద వివాదంగా మారిందని.. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్ కాట్ తిరుపతి అనటం వైరల్ అవుతుందని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ తప్పుడు నిబంధనలు తీసుకురావటమే ఈ వివాదానికి కారణమని.. సీఎం జగన్ ఏ దేవుడిని నమ్ముతారో దేశ ప్రజలకు తెలుసు అని వెల్లడించారు రాజాసింగ్‌.

Read more RELATED
Recommended to you

Latest news