ఆటో డ్రైవర్ మారి.. తోబుట్టువులను చదివిస్తున్న మహిళ.. హ్యాట్సాప్..

-

ఒకప్పుడు అమ్మాయిలు వంట గదికే పరిమితం అయ్యేవారు.. కానీ ఇప్పుడు మేము ఎందులో తక్కువకాదని నిరూపిస్తున్నారు. అంతరిక్షంలోకి కూడా వెళుతున్నారు.. మగవాళ్ళను మించి దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది మహిళలు ఆదర్శంగా నిలిచి అందరిచేత ప్రశంసలు అందుకున్నారు.. తాజాగా మరో మహిళ జనాల అభినందనలు అందుకుంటుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

అమ్మానాన్నలిద్దరూ మృతిచెందారు. అన్నతమ్ముళ్లు కూలీ పనులు చేయగా వచ్చే చాలీచాలని సంపాదనతో జీవనం సాగించేవారు.. వచ్చినవి ఆరోజోకే సరిపోయేవి.. జీవితం కష్ట తరంగా మారింది. దాంతో చలించిపోయిన ఆమె కష్టపడి ఆటో నేర్చుకున్నారు. రోజూ ఆటో నడపగా వచ్చిన సంపాదనతో కుటుంబానికి ఆసరాగా ఉంటున్న తాడిపత్రికి చెందిన ఖైరున్‌బీ గురించి స్ఫూర్తిదాయక కథనం..

తాడిపత్రి పట్టణంలోని మెయిన్‌బజార్‌ పాత ఆంధ్రాబ్యాంకు వెనకాల వీధికి చెందిన బాషు, గౌసియాబీలకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. వారిలో ఖైరున్‌బీ మూడో సంతానం. 14 ఏళ్ల కిందట నాన్న, ఆరు నెలల క్రితం అమ్మ మృతిచెందారు. అన్న, తమ్ముళ్లు చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వారికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ఖైరున్‌బీ ఆటో నేర్చుకున్నారు. లైసెన్సు పొంది రోజూ ఆటో నడుపుతూ వచ్చిన సంపాదనతో చెల్లెళ్లు, తమ్ముళ్లకు అండగా నిలిచారు. 8 నెలల కిందట ఒక చెల్లెలికి పెళ్లి చేశారు. మరో చెల్లెలిని పదోతరగతి వరకు చదివించారు.. ఆ అమ్మాయి ఇప్పుడు ఉర్దూ టీచర్ గా పనిచేస్తుంది.

తమ్ముడి భార్య కొన్ని నెలల కిందట మృతి చెందారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. ప్రస్తుతం వారి ఆలనాపాలనను ఖైరున్‌బీ చూస్తున్నారు. రోజూ ఉదయాన్నే ఇద్దరు చిన్నారులను రెడీ చేసి పాఠశాలకు వదిలిపెట్టి వస్తారు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో మరో చిన్నారిని తన వెంట ఆటోలో తీసుకెళ్తున్నారు. ఆటో నడుపుతూ రోజూ రూ.500 సంపాదిస్తున్నట్లు చెప్పారు.. పిల్లల కోసం త్వరగా ఇంటికి వెళ్లడం వల్ల తక్కువే వస్తున్నాయని చెబుతుంది.. ఈ తెగింపు చూసి చుట్టుపక్కల వాళ్ళు ప్రశంసిస్తున్నారు.. మహిళలకు స్ఫూర్తి దాయకంగా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news