ఓడిపోతున్నామని నిరాశతో కుంగిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఎంత ప్రయత్నించినా గెలుపు తలుపు తట్టట్లేదని బాధపడేవాళ్ళూ ఉన్నారు. ఇలా బాధపడేవాళ్ళు ఒక్క విషయం ఆలోచించుకోవాలి. బాధపడుతూ కూర్చుంటే గెలుపు నీ సొంతమవుతుందా? ఏడుస్తూ ఉంటే విజయం నీ దగ్గరకు వస్తుందా? రాదు కదా. మరెందుకు బాధపడడం. అన్నీ చేసినా విజయం రావట్లేదంటే నీ చేయడంలోనే ఏదో లోపం ఉండి ఉండాలి. ఆ లోపమేంటో కనుక్కో. దాన్ని రిపేరు చెయ్యి. అలా రిపేఉ చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు నీఖు తెలుస్తాయి.
అసలు నీ దారి అదేనా? నువ్వు వెళ్ళాలనుకుంటున్న ఊరు అదేనా? ఒక ఊరు వెళ్ళాలనుకుని మరో ఊరి బస్సు ఎక్కితే లాభం ఏంటి? నీ ఇంట్రెస్ట్ నిజంగా అదేనా అన్నది ముందుగా గుర్తించు. అలా గుర్తించనంత కాలం నువ్విలా బాధపడుతూనే ఉంటావు. మీ ఇంట్లో వాళ్లకోసమో, లేదా మీకు బాగా కావాల్సిన వాళ్ల కోసమో ఏదో చేయాలని తపన పడుతున్నావు కదా. ఆ తపనలో ఆనందం పొందాలి. అలా పొందలేదంటే వెంటనే ఆ పనిని పక్కన పెట్టెసేయ్.
ప్రయత్నంలో ఆనందం పొందలేనన్ని రోజులు ఓటమిలన్నీ నిన్ను బాధిస్తూనే ఉంటాయి. అయినా ఓడిపోతే బాధపడడం వేస్ట్. ఎంత మంది ఓడిపోలేదు. ఓడిపోతేనే కదా గెలుపు విలువ తెలిసేది. రెండుసార్లు ఓడిపోయి మూడవ సారి గెలిస్తే ఆ కిక్కు ఎలా ఉంటుంది. అంటే ఎన్ని ఎక్కువసార్లు ఓడిపోతే నీ గెలుపు అంత కిక్కుగా మారనుందన్న మాట.
అందుకే ఓటమికి బాధపడకూడదు. ఏదో సినిమాలో చెప్పినట్టు గెలుపులో ఏముంది, మహా అయితే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అదే ఒక్కసారి ఓడిపోయి చూడ్, నిన్ను నీకు పరిచయం చేస్తుంది. చాలా మంది తమని తాము తెలుసుకోరు. ఓటమికి అదే పెద్ద కారణమన్నది కూడా వాళ్ళు మర్చిపోతారు. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో.