కొన్ని రోజుల క్రితం భారత క్రికెట్ ఆటగాడు రిషబ్ పంత్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ధోనీ రిటైర్ అయ్యాక వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఆడుతున్నప్పటి నుండి అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐతే అప్పుడు రిషబ్ ఆటతీరు కూడా అంతంతమాత్రంగానే కనిపించింది. అందువల్ల పంత్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐతే ప్రస్తుతం కథ పూర్తిగా మారిపోయింది. పంత్ బాగా జోరుమీదున్నాడు. అతడి ఆటతీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పంత్ విజృంభణ మామూలుగా లేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రశంసలు పడుతున్నాయి. ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పంత్ ఆటతీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. భయం లేని క్రికెటర్ అని చెబుతూ, పంత్ ఒక ప్యాకేజీ లాంటి వాడని, ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు చతికిల పడతాడో తెలియదంటూ, హార్ట్ ఎటాక్ తెప్పిస్తాడని అన్నారు. అందర్నీ ఆశ్చర్యపడేలా చేయడంతో పాటు నిరాశ పర్చడమూ పంత్ కి తెలుసని కామెంట్ చేసాడు.