మనసంతా బాధ నిండి కదలడానికి శక్తి లేకుండా అయిపోయిందా? ఒక్కసారి ఇది తెలుసుకోండి.

-

మనం కావాలనుకున్న దాని గురించి కష్టపడి ఇంకా కొద్ది దూరం వెళితే అది అందుతుందన్న ఆశతో కాళ్ళతో సత్తువ లేకపోయినా, ఆ దూరం వెళితే లభించేది ఇచ్చే శక్తిని గుర్తుకు తెచ్చుకుని, పడి లేస్తూ పోయినపుడు అక్కడి దాకా వెళ్ళాక మన అనుకున్నది ఇంకా దూరం జరిగితే, అలా జరుక్కుంటూ వెళ్ళిపోతే మనసు వ్యాకుల పడకుండా ఉంటుందా? ఇక మనం కావాలనుకున్న గమ్యాన్ని చేరుకోలేమన్న భావన మనలో చేరి మనమింతేనా అని మనకే అనిపించి మనలో శక్తిని మనం తీసేసుకుంటే మనసు బాధపడదా?

అవును, చాలా మందికి తాము కావాలనుకున్నది దొరకదు. దేనికోసమో వెతికితే మరింకేదో దొరుకుతుంది. నూటికి తొంభై మందికి అంతే. జీవితం ఎవ్వరికీ ఏదీ వందశాతం ఇవ్వదు. కానీ, మనం అనుకుంటాం. ఇంత చేసినా నాకే ఇలా అవుతుందేంటీ అని. అది నిజం కాదు. ప్రతీ ఒక్కరూ ఆ మాటకొస్తే మీకంటే ఎక్కువ ప్రయత్నించిన వారు కూడా ఓడిపోయారు. ఓటమి అనేది చాలా కామన్. ఇలా చెప్తే జీర్ణం చేసుకోలేరు. ఎందుకంటే, విజయం కోసం పరుగెత్తినవాడికి ఓటమి ఎంత పెద్ద దెబ్బ కొడుతుందో తెలుసు కాబట్టి.

ఐతే అలా అని మనసును బాధ పెట్టుకుని అక్కడే ఆగిపోవడం కరెక్ట్ కాదు. ఒక ఓటమి అనేది బస్టాప్ లాంటిది. ఒక ఊరికోసం బయలు దేరి మరో ఊరి బస్టాప్ లో దిగడం. మరో ఊరి బస్టాప్ నుండి మీరు వెళ్ళాలనుకున్న ఊరికి బస్సుందా? ఉంటే ఎప్పుడుంది? ఎలా వెళ్ళాలి? ఎంత సేపు వెయిట్ చేయాలి అనేది మీరే తెలుసుకోవాలి. అలాంటప్పుడు మీరు ఎప్పటికయినా మీ గమ్యాన్ని చేరుకోగలరు. మనసు బాధ చేసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుని వేరే ఊరి బస్టాప్ లో కూర్చుంటే చూసిపోయే వాళ్ళు జాలిగా చూస్తారే తప్ప, మీకు సాయం చేయరు. మీకు కావాల్సిన బస్సు వచ్చినా మీరు గుర్తించని స్థితికి వెళ్ళిపోతారు.

Read more RELATED
Recommended to you

Latest news