కుమారుడికి జెడ్పీ చైర్మన్ పీఠం కోసం సిక్కోలు మంత్రి మాస్టర్ ప్లాన్

-

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సిక్కోలు మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన వారసుడిని రంగంలోకి దిచేందుకు అంతా సిద్ధం చేశారు. పరిషత్ ఎన్నికల్లో బరిలో దించి కిందిస్థాయి నుంచి రాజకీయాల్లో రాణించేలా చేయాలనే ఉద్ధేశంతో ఏడాది కిందటే నామినేషన్లు దాఖలు చేయించారు. అధికార పార్టీలో ఉన్న పోటీని తట్టుకుని కుమారుడికి జెడ్పీ పీఠం కట్టబెట్టేందుకు కొత్త అస్త్రం బయటికి తీశారు మంత్రి కృష్ణదాస్. దీనిపై సిక్కోలు జిల్లాలో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.


శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన కుటుంబానిది ప్రత్యేక స్థానం. నరసన్నపేట నియోజకవర్గం పరిధిలోని పోలాకి మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్ధిగా కృష్ణదాస్ కుమారుడు కృష్ణచైతన్య నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న ఏ ఒక్కరి కుటుంబ సభ్యులకు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధినేత జగన్ అనుమతి ఇవ్వలేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్న వారికి మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో కుమారుడికి జెడ్పీ పీఠం కట్టబెట్టడం కోసం కొత్త ఎత్తు వేశారు కృష్ణదాస్.

ఇదే నాకు చివరి ఎన్నికలు వచ్చేసారి పోటీలో ఉండనని పదే పదే చెబుతున్నారు మంత్రి ధర్మన కృష్ణదాస్. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ధర్మాన కృష్ణచైతన్య 2019 ఎన్నికల ముందు నుంచే తండ్రి కృష్ణదాస్ వెంట నడుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కృష్ణదాస్ బిజీబిజీగా ఉంటున్న సమయంలో నియోజకవర్గ బాధ్యతలన్నీ కృష్ణచైతన్యే చూసుకుంటున్నారు. పొలిటికల్ వచ్చే ఎన్నికల నాటికి తాను సైడ్ అవుతున్నా అనే సిగ్నల్స్ సీఎం జగన్ కి పంపారట కృష్ణదాస్. ఇదే క్రమంలో తనయున్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపి జెడ్పీ పీఠం కోసం పావులు కదుపుతున్నారు.

ఇప్పటికే తండ్రి, బాబాయ్ సిక్కోలు రాజకీయాల్లో ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్‌ చేసుకున్నారు. మరీ ఇప్పుడా కుటుంబం నుంచి వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న కృష్ణచైతన్య ఫ్యామిలీ బ్రాండ్‌ ఇమేజ్‌ను ఏమేరకు నిలబెడతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news