వైద్య కర్మాగారం.. క్యూబా.. ఓటమికి వైద్యం చేస్తోంది…!

-

క్యూబా… ప్రపంచంలో అతి చిన్న దేశం. జనాభా ఉన్నా సరే ఆ దేశం చాలా చిన్నది. భారత్, అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్ లాంటి దేశాలతో పోలిస్తే ఆ దేశం పెద్దది కాదు. లాటిన్ అమెరికాలో ఆ దేశం అత్యంత శక్తివంతం. అన్ని రంగాల్లో కూడా క్యూబా ముందు ఉంటుంది. విద్య, వైద్యం, వ్యాపారం ఇలా ఏ రంగం చూసినా సరే ఆ దేశం ప్రపంచంతో పోటీ పడుతుంది. చదువుకొని వాళ్ళు అనేది ఆ దేశంలో ఉండకూడదు.

ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరగకూడదు. అలాగే అక్కడ ఎవరికి అనారోగ్యం వచ్చినా సరే దిక్కులేని చావు మాత్రం చావడానికి వీలు లేదు. అందరికి ఆరోగ్యం ఉండాలి… అప్పుడే దేశం బాగుంటుంది అని నమ్ముతారు క్యూబన్లు. ఎప్పుడు అయితే ఫిడేల్ క్యాస్ట్రో ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యారో అక్కడి నుంచి కూడా దేశం అన్ని రంగాల్లో ప్రపంచం తో పోటీ పడింది. అమెరికా అవసరం ఒక్క శాతం కూడా లేకుండా క్యూబా ఎదిగింది.

ఇప్పుడు కరోనా విషయంలో ఆ దేశమే ప్రపంచానికి అండగా ఉంది. క్యూబా కంటే ఎంతో గొప్ప చరిత్ర ఉన్న దేశం ఇటలీ… అక్కడి నుంచి వైద్యులను దిగుమతి చేసుకుంటుంది. యూరప్ దేశాలు అన్నీ కూడా ఇప్పుడు క్యూబా మీదే ఆధారపడే పరిస్థితి. వైద్య రంగంలో ప్రపంచానికి క్యూబా ఆదర్శం. కొన్ని దశాబ్దాల క్రితం ఆ దేశంలో ఒక అంటు వ్యాధి వచ్చింది. ఏ దేశం కూడా తమ దేశానికి సాయం చేయలేదు.

దీనితో ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న ఫిడేల్ క్యాస్ట్రో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెద్ద ఎత్తున వైద్యులను తయారు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. దేశాన్ని డాక్టర్ల ఉత్పత్తి కర్మాగారంగా మలచింది క్యూబా. ఆ దేశంలో ప్రస్తుతం ప్రతీ 1000 మంది క్యూబన్లకు 8.2 మంది డాక్టర్లు ఉన్నారు. ఏ దేశం కూడా ఈ స్థాయిలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేసుకోలేదు. వాళ్ళు అందరూ కూడా నిపుణులే.

చికిత్స కంటే నివారణ ముఖ్యం అని గుర్తించింది క్యూబా. 1992 నాటికి ప్రతీ వంద మందిలో 96 మందికి వైద్యం అందించే విధంగా క్యూబా ఎదిగింది. క్యూబాలో కోటి మంది ఉంటే అందులో ఒక్క శాతం… అంటే లక్ష మంది వైద్యులు ఉన్నారు. వారిలోనూ 33 వేల మంది ఫ్యామిలీ ఫిజీషియన్లు ఉన్నారు. కరోనా వైరస్ నేపధ్యంలో అక్కడి వైద్యులు విదేశాలకు సేవలు అందిస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

1960 నుంచి కూడా క్యూబా వైద్యులు అన్ని దేశాల్లోను పని చేస్తున్నారు. 77 దేశాల్లో 37 వేల మంది క్యూబా వైద్యులు ఉన్నారు. ఇతర దేశాల్లో వైద్య సేవలు క్యూబాకు పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. 2018 లో క్యూబా విదేశీ ఆదాయాల్లో 43 శాతం వైద్య సేవల నుంచే వచ్చింది. ఎన్నో దేశాలకు క్యూబా వైద్య రంగంలో ఆదర్శంగా నిలిచింది. క్యూబా మీద ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆధారపడింది అనేది వాస్తవం.

Read more RELATED
Recommended to you

Latest news