మొదట ఈ పద్ధతులని చూసి నవ్విన వాళ్ళే ఇప్పుడు అనుసరిస్తున్నారు: మహిళా రైతు రజిత

-

27 ఏళ్ల వయసులో కె.రజిత అనేక రకాల పంటలను ఒక ఎకరం పొలంలో పండించడం మొదలుపెట్టింది. నాగులుప్పలపాడు లో ఆమె వ్యవసాయం చేస్తూ ఉండేది. ఆమె తన వ్యవసాయం లో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పద్ధతిని అనుసరించేది. అలా ఆమె ప్రతి సీజన్ కి మూడు లక్షల రూపాయలు పొందేది.

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన రజిత సదానంద రావు తో ఆమెకు వివాహమైన తర్వాత వ్యవసాయమే చేసుకునేది. ఆ సమయంలోనే డిఆర్డిఏ అప్లికేషన్స్ ని ఇన్వైట్ చేశారు. సహజ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు అప్లికేషన్లు విడుదల చేయగా ఆమె అప్లై చేసుకుంది. ట్రైనింగ్ తీసుకున్న రజిత పంటల్ని పండించడం మొదలు పెట్టింది.

అది కూడా నాచురల్ పద్ధతిలోనే. సహజసిద్ధమైన పెస్టిసైడ్స్ ఉపయోగించి పండిస్తూ ఉండేది. ఎప్పటి నుండో పండిస్తున్న రైతులు ఎవరూ కూడా తన మాటల్ని నమ్మలేదు. అదే విధంగా ఈ కొత్త పద్ధతిని గురించి వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేదు. కొందరైతే ఆమె పండించే విధానాన్ని చూసి నవ్వారు. అయితే ఎప్పుడైతే ఆమెకి మంచి పంట వచ్చేదో అప్పుడు NPM మరియు ZBNF మీద మీద వాళ్లు ఆసక్తి చూపించారు.

ఇప్పుడు చాలా మంది రైతులు ఈ కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆమె ఎందరో మందికి ఆదర్శంగా నిలిచింది. చాలా మంది ఇప్పుడు ఐదు సెంట్ల పొలం లో 12 రకాల పంటల్ని పండించి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

గత సీజన్లో ఆమె నవధాన్యాలను పండించింది. అదే విధంగా ఉల్లి, క్యాబేజీ, కాలిఫ్లవర్, స్వీట్ కార్న్, కొత్తిమీర, ముల్లంగి మొదలైన వాటిని కూడా పండించడం జరుగుతోంది. చాలా వెరైటీలలో ఆమెకి మంచి ఆదాయం లభించింది. కేవలం ఒక ఎకరం పొలం లోనే ఆమె పదిహేను నుండి ఇరవై రకాల పంటలను వేస్తోంది అని ఆమె చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news