అన్ లైన్ స్నేహాన్ని ఆఫ్ లైన్ స్నేహంగా మారుస్తున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

-

కరోనా కారణంగా అన్నీ ఆన్ లైన్లోనే జరుగుతున్నాయి. సుప్రీంం కోర్టు తీర్పులు కూడా ఆన్ లైన్ వేదికగానే వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉండడంతో అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులందరూ దాదాపుగా ఇంటి నుండే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ స్నేహాలు ఎక్కువ అవుతున్నాయి. సోషల్ మీడియాలో మాటలు కలిపి, ఆ తర్వాత క్రమంగా ఫోన్ సంభాషణలు పెరిగి, చివరికి ఆఫ్ లైన్ స్నేహానికి దారి తీస్తున్నాయి. ఐతే ఇలా ఆఫ్ లైన్ స్నేహాలుగా మారే ఆన్ లైన్ స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఇద్దరికి నచ్చిన చోటు ఎంచుకోండి.

ఆన్ లైన్ స్నేహాని ఆఫ్ లైన్ స్నేహంగా మార్చుకుంటున్నప్పుడు మొదటగా కలిసే చోటు మీ ఇద్దరికీ నచ్చినదై , సౌకర్యవంతంగా ఉండేదై ఉండాలి. అలా కాకుండా ఒకరికి బాగా తెలిసి మరొకరికి అస్సలు తెలియని ప్రదేశాల్లో కలవవద్దు. దానివల్ల ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.

మీ స్నేహితులను కూడా వెంట తీసుకెళ్ళండి

మీ ఆన్ లైన్ స్నేహితులను కలుస్తున్నప్పుడు మీ స్నేహితులను వెంట తీసుకెళ్ళండి. కానీ మీకు దూరంగా ఒక కంట కనిపెట్టమని చెప్పండి. ఎవరెలా ఉంటారో ఎవరికీ తెలియదు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరుండడం చాలా మంచిది. అనవసర అతి నమ్మకాలు ఒక్కోసారి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి.

ఎక్కువ వినండి

మొదటి కలయికలో మీరు ఎక్కువగా మాట్లాడకండి. అవతలి వారు చెప్పేది జాగ్రత్తగా వినండి. వారి మాటల్లో వారి స్వభావం అర్థం అవుతుంది. అందుకే వారిని ఎక్కువ మాట్లాడనివ్వండి.

సమయస్ఫూర్తితో ఉండాలి

ఇద్దరు ఒక చోట కలవాలనుకున్నప్పుడు సమయపాలన చాలా అవసరం. మొదటి ఇంప్రెషన్ దక్కేది అక్కడే. కాబట్టి టైమ్ కి అక్కడికి చేరుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news