ఒక్కడే… వరదలో కొట్టుకుపోతున్న 500 మందిని కాపాడాడు.. తన ప్రాణాల పణంగా పెట్టి..!

-

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వర్షాలు ఎలా కురుస్తున్నాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్ర వరదలతో అల్లాడుతోంది. దాదాపు 500 గ్రామాల వరద నీటిలో మునిగిపోయాయి.

ఈ ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. కానీ.. కొందరు మాత్రం అంత విలువైన ప్రాణాన్ని కూడా లెక్కచేయరు. అది కూడా వేరే వాళ్ల కోసం తమ ప్రాణాలను పణంగా పెడతారు. అటువంటి వాళ్లు నూటికో.. కోటికో ఒక్కరు ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి కూడా కోటికి ఒకరు.. అవును… తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఏకంగా 500 మందిని దాకా వరద బారి నుంచి కాపాడాడు. ఆయనే రామ్ దాస్ ఉమాజి మదానే.

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వర్షాలు ఎలా కురుస్తున్నాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్ర వరదలతో అల్లాడుతోంది. దాదాపు 500 గ్రామాల వరద నీటిలో మునిగిపోయాయి. 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వాళ్లను వెంటనే వరద బారి నుంచి తప్పించి శిబిరాలకు తరలించారు.

వరద ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సంగ్లి జిల్లా ఒకటి. సంగ్లీలోని పలస్ తాలుకా దుదొండి గ్రామానికి చెందిన రామ్ దాస్ అక్కడ వరదల్లో చిక్కుకున్న వందల మందిని కాపాడి హీరో అయ్యాడు. నిజానికి రామ్ దాస్ మత్స్యకారుడు. చేపలు పట్టడం ఆయన వృత్తి.

వారం రోజులు ఏకధాటిగా వర్షం కురిసింది. ఆసమయంలో ఇళ్లను వదిలేసి అందరూ శిబిరాలకు వెళ్లాలని… వరద ముంపు ఉందని ముందే అధికారులు హెచ్చరించారు. కానీ.. అధికారుల హెచ్చరికను అందరూ పెడచెవిన పెట్టారు. వర్షం ఆగకపోవడం.. వరద ముంచుకురావడంతో మా ఊరు మొత్తం మునిగిపోయింది.. అంటూ వరద సృష్టించిన బీభత్సాన్ని రామ్ దాస్ గుర్తు చేసుకున్నారు.

వరద నీటిలో మునిగిపోయిన వందల గ్రామాల్లో రామ్ దాస్ ఊరు ఒకటి. చివరకు ఆయన ఇల్లు కూడా వరదలో మునిగిపోయింది. వందల మంది ప్రజలు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతుండగా… వెంటనే రామ్ దాస్.. తను చేపలు పట్టడానికి ఉపయోగించే చిన్నసైజు బోటులో వరదలో చిక్కుకున్న గ్రామస్తులను ఎక్కించుకొని సమీపంలోని గ్రామాలకు తరలించాడు. అలా 500 మందిని దాకా వరద బారి నుంచి తప్పించాడు. ఆ సమయంలో వరద బీభత్సం సృష్టించినా.. తన ప్రాణాన్ని లెక్కచేయకుండా వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించి హీరో అయ్యాడు.

అది చాలా చిన్న బోటు. ఎక్కువ మందిని అందులో ఎక్కిస్తే దాని బ్యాలెన్స్ ఆగదు. అందుకే… నేను కనీసం 300 సార్లు తిరగాల్సి వచ్చింది. సురక్షిత ప్రాంతం ఎక్కడ కనపిస్తే అక్కడ గ్రామస్తులను నా బోటులో వదిలి వచ్చేవాడిని… అంటూ ఆ ఘటనను గుర్తు తెచ్చుకున్నాడు రామ్ దాస్.

రామ్ దాస్ నీకేమైనా పిచ్చా. నీ ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా అంతమందిని కాపాడటం అవసరమా? అని నన్ను ప్రశ్నించారు. కానీ.. ఎందుకు కాపాడకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం మనిషిలా ప్రవర్తించకుంటే మనం మనుషులం ఎందుకు అవుతాం. హీరోలం ఎలా అవుతాం.. అంటూ చెప్పుకొచ్చాడు రామ్ దాస్.

Read more RELATED
Recommended to you

Latest news