కార్పొరేట్ స్కూల్ కాదు.. గవర్నమెంట్ స్కూలే.. అత్యాధునిక హంగులతో… ఎక్కడో తెలుసా?

ఈరోజుల్లో కార్పొరేట్ విద్య అందనంత దూరంలో ఉంది. నర్సరీ, ఎక్కేజీలు, యూకేజీలు చదివించాలన్నా లక్షలకు లక్షలు సమర్పించాల్సిందే. ఈ జనరేషన్ లో మనం చదువుకొంటున్నాం.. కార్పొరేట్ విద్యా సంస్థల్లో అయితే మధ్యతరగతి, పేదల పిల్లలు చదవాలని అని కలలో కూడా అనుకోలేరు.

మరి.. మనకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా. అందులో చదివించొచ్చు కదా అనే డౌట్ వస్తుంది. అవును.. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఉన్నా కూడా కార్పొరేట్ విద్యాసంస్థలు ఎందుకు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. దానికి కారణం ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసే వాళ్లే.. వాళ్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో కాకుండా కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. అంటే.. ప్రభుత్వ స్కూళ్లలో సరైన విద్య అందడం లేదని వాళ్లు అనుకుంటున్నట్టే కదా. వాళ్లే చదివించలేనప్పుడు మిగితా వాళ్లు ఎలా చదివిస్తారు. సరే.. ఇది నెవర్ ఎండింగ్ టాపిక్. దాని గురించి ఎంత చర్చించినా తక్కువే కానీ.. ఓసారి మహారాష్ట్రం వెళ్లొద్దాం పదండి. ఎందుకు అక్కడేం పని అంటారా? ఇప్పటి దాకా మనం మాట్లాడుకున్నాం కదా.. కార్పొరేట్ విద్య, ప్రభుత్వ విద్య అని.. దానికి సమాధానం అక్కడ ఉంది.. అందుకే వెళ్దామనేది.

మీరు పైన ఫోటోలు చూశారా? ఏంటి.. ఆ రంగు రంగుల బోర్డులు.. చెట్లు.. కలర్లు.. బాగా డెకరేట్ చేశారు.. ఏంటిది పార్కా? అని అనకండి. అది ప్రభుత్వ పాఠశాల. అవును.. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ అది. మహారాష్ట్రలోని రాయిగఢ్ జిల్లాలోని హెడ్వాలిలో ఉంది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఉంది కదా స్కూల్.

అవును.. ఆ ఊరి ప్రజలు అంతా కలిసి కట్టుగా ఉండి.. అధికారులను బతిమిలాడుకొని.. చందాలు వేసుకొని.. ఇలా ఎన్నోరకాలుగా ప్రయత్నించి ఇదిగో.. ఆ స్కూల్ ను ఇలా సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లలు కూడా ఆ స్కూల్ ను చూసి ఆ స్కూల్ కు వెళ్లకండా ఉండలేకపోతున్నారు. అది ప్రభుత్వ పాఠశాల కాదు.

కార్పొరేట్ స్కూల్ అన్నట్టుగా ఉంది. అన్ని సౌకర్యాలు. అని ఆధునిక సౌకర్యాలు.. బెస్ట్ టీచర్లు.. అందరూ ఉన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు నాణ్యమైన విద్య ఉన్న ఊళ్లోనే దొరుకుతుందంటే.. వాళ్లకు ఇంకా కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి. అయితే.. ఇది ఏ ఒక్కరి కృషి మాత్రం కాదు. అందరి కృషి.. అందరూ కలిసి నడుం బిగించారు. ది బెస్ట్ స్కూల్ గా తీర్చిదిద్దుకున్నారు. వావ్.. దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇలాగే ఉంటే.. పిల్లలు కార్పొరేట్ స్కూళ్లకు పోవాల్సిన అవసరమే ఉండదు. రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను పొందొచ్చు. ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని అన్ని పాఠశాలలు అలాగే రూపుదిద్దుకోవాలని ఆశిద్దాం.