ఐఐటీ పట్టా.. అమెరికా ఉద్యోగం.. అన్నీ వదిలేసి ఆవుల్ని కొని పాలవ్యాపారం.. 44కోట్ల ఆదాయం..

-

నీలో కోరిక బలంగా ఉంటే దాన్ని నెరవేర్చుకోవాలన్న ఆరాటానికి ఆచరణ తోడైతే ఎప్పుడో ఒకప్పుడు అక్కడి చేరుకుంటావని చెబుతుంటారు. చాలామంది కలలు కంటారు. కానీ, కొందరే వాటిని నిజం చేసుకుంటారు. మాజీ ఇంజనీరు కిషోర్ ఇందుకూరిది అలాంటి కథే. సౌకర్యవంతమైన ఉద్యోగం, లక్షల్లో ఉద్యోగం, అన్నీ వదిలేసుకుని తనకు నచ్చిన జీవితాన్ని ప్రారంభించి అందులో శిఖరాగ్రాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పట్టుదల, ఎంతో అంకితభావం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.

కర్ణాటకకి చెందిన కిషోర్ ఇందుకూరి ఇంజ‌నీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని మసాచుసెట్స్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడే ఇంటెల్ కంపెనీలో ఆరేళ్ళు ఉద్యోగం చేసాడు. కానీ ఆ ఉద్యోగం అతనికి సంతృప్తి ఇవ్వలేదు. వెంటనే జాబ్ మానేసి ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఇక్కడ ఏం చేద్దామన్న ఆలోచనకి కిషోర్ కి ఓ ఆలోచన తట్టింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సరైన పాలు దొరకడం లేదని, స్వఛ్ఛమైన పాలకి బాగా గిరాకీ ఉంటుందని భావించిన కిషోర్, 20ఆవుల్ని కొని వ్యాపారం ప్రారంభించాడు.

ఆవుపాలని డైరెక్టుగా వినియోగదారుల ఇంటివద్దకే పంపించేలా ఏర్పాటు చేసాడు. పాలు చెడిపోకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఫ్రీజర్ అభివృద్ధి చేసుకున్నారు. 2012లో ప్రారంభించిన ఈ బిజినెస్ ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదిగింది. తన కొడుకు సిద్ధార్థ పేరుతో సిద్ ఫామ్ అని తన వ్యాపారానికి పేరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం కిషోర్ దగ్గర 120ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిద్ ఫామ్ సంవత్సర రెవెన్యూ 44కోట్లకి పెరిగింది. కోరిక ఉండి దాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదల ఉండే సాధించలేనిదంటూ ఏదీ లేదని చెప్పడానికి కిషోర్ ఇందుకూరి కన్నా మంచి ఉదాహరణ మరొకటి ఉండదేమో!

Read more RELATED
Recommended to you

Latest news