స్ఫూర్తి: అప్పుడు స్కూల్ లో ఫెయిల్.. కానీ ఇప్పుడు IAS టాపర్..!

-

ప్రతీ ఒక్కరి జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్ ఉంటుంది. అయితే అన్ని సార్లు సక్సెస్, అన్ని సార్లు ఫెయిల్యూర్ అనేది వుండవు. ఒక్కోసారి ఒక్కొక్కటి ఉంటుంది. పైగా ఏది ఎప్పుడు ఎలా వస్తుంది అనేది కూడా చెప్పలేము. నిజానికి ఓటమి గెలుపు కి మొదటి మెట్టు. అంజూ శర్మ యూపీఎస్సీ పరీక్షను 22 ఏళ్ల కి క్రాక్ చేశారు.

నిజానికి ఆమె స్కూల్లో చదువుతున్నప్పుడు పన్నెండవ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఆమె సక్సెస్ స్టోరీ నిజంగా ఎందరికో ఆదర్శం. మరి ఆమె సక్సెస్ గురించి ఇప్పుడు చూద్దాం. అంజు శర్మ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రెటరీ గవర్నమెంట్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ డిపార్ట్మెంట్ గాంధీనగర్ లో ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ముందు ఆమె ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పని చేశారు.

పన్నెండో తరగతి ఎకనామిక్స్ పరీక్షలో ఆమె ఫెయిల్ అయ్యారు. మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆమె డిస్టింక్షన్ లో పాసయ్యారు. పదో తరగతి చదువుతున్నప్పుడు ఆమె ప్రీ బోర్డ్ పరీక్షలు రాసినప్పుడు కెమిస్ట్రీ లో ఫెయిల్ అయ్యారు. అయితే నిజానికి రెండు ఓటములు రావడం వలన ఆమె భవిష్యత్తుని బాగా నడిపించాయని అనుకుంటున్నారు.

ఒక్కోసారి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం మరింత కష్టపడ్డామని ఆమె చెప్పారు. అలానే తన తల్లిదండ్రులు ఆమెకి బాగా సపోర్ట్ గా ఉన్నారని చెప్పారు. ఆమె తల్లి ఆమెను ఎంతగానో మోటివేట్ చేశారని ఆమె చెప్పారు. నిజానికి ఒక సారి గెలుపు ఉంటే ఒక్కసారి ఓటమి ఉంటుంది. ఓటమి ఉంది కదా అని మనం అలానే ఉండిపోతే అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. అయితే అంజు శర్మ లాగా మనం కూడా ఓటమి నుండి గెలుపు వైపు కి వెళ్ళాలి. దానికి తగ్గ కృషి చేయాలి. అప్పుడు ఖచ్చితంగా అంజు శర్మ లాగ మనం కూడా విజయం సాధించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news