ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఎన్నో అనుకుంటూ ఉంటాము. అనుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా కానీ అనుకున్నది సాధించడమే చాలా కష్టమైన పని. ఎంతగానో కష్టపడితే కానీ మనం అనుకున్నది సాధించలేము. ఒక్కొక్క సారి జీవితంలో ఎన్నో నష్టాలని ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మనం చేయాలనుకున్న దానిని మధ్యలో వదిలేయకూడదు. అది నిజంగా పొరపాటు.
ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే మనం శ్రమించాలి. మన గోల్ మీద ధ్యాస పెట్టాలి. సునీల్ వశిష్ట్ కూడా తన అనుకున్నది సాధించడానికి ఎంతగానో శ్రమించాడు. ఈయన వయసు 45 సంవత్సరాలు. మల్టీ క్రోర్ బ్రాండ్ ఫ్లయింగ్ కేక్స్ ని మొదలుపెట్టారు. ఆయన తండ్రి మెకానికల్ లేబరేర్ అయితే చదువుకోడానికి కూడా డబ్బులు ఉండేవి కాదట .అందుకే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది.
డిగ్రీ చదువుతూనే ఎన్నో పనులు చేసే వారట. ఫార్మ్ హౌస్ లో వెయిటర్ కింద రెస్టారెంట్లో వెయిటర్ కింద సేల్స్ పర్సన్ కింద శారీస్ స్టోర్ లో పని చేయడం ఇలా చాలా పనులు చేశారు. కొరియర్ డెలివరీ బాయ్ కింద కూడా కొన్ని రోజులు పని చేశారు. చదువుకోవడం కుదరక చదువు కూడా మానేశారు. 1998లో పిజ్జా చైన్ డొమినోస్ లో డెలివరీ బాయ్ కింద జాయిన్ అయ్యి రెండు నెలల్లోనే కష్టపడి అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు.
ఆ తర్వాత అనుకోకుండా ఉద్యోగం పోయింది. ఎగ్ రోల్ కార్ట్ ని జేఎన్యూ ఢిల్లీ దగ్గర మొదలుపెట్టారు కొన్ని రోజులు బాగానే నడిచింది. ఆ తరవారా నోయిడా లో కేక్ షాప్ ని స్టార్ట్ చేశారు ఈ షాపు కోసం తన భార్య నగలని కూడా అమ్మాల్సి వచ్చింది. ఇలా చిన్న షాప్ కాస్త ఇప్పుడు బాగా పాపులర్ అయింది. ఇండియాలో ఫ్లయింగ్ కేక్స్ కి 15 అవుట్ లైట్స్ ఉన్నాయి నిజంగా ఇది కథ సక్సెస్ అంటే..