రూపాయికే అంత్యక్రియలు.. ప్రారంభించిన మేయర్

-

రూపాయికి రశీదు ఇవ్వడంతో పాటు.. పాడె కట్టడం దగ్గర్నుంచి డప్పు చప్పుల్లు, అంతిమయాత్ర, దహన సంస్కారాలు, ఇతర అన్ని కార్యక్రమాలను ఆచారాల ప్రకారం పూర్తిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే చేపడతారు.

ఈరోజుల్లో పుట్టడమే కాదు.. చనిపోయిన వాళ్లకు దహన సంస్కారాలు నిర్వహించడం కూడా ఖర్చుతో కూడుకున్న పనే. ఓ వ్యక్తి చనిపోయిన దగ్గర్నుంచి ఆ వ్యక్తి అంతిమ యాత్ర, దహన సంస్కారాలు నిర్వహించడం కోసం చాలా ఖర్చు పెట్టాలి. అందుకే.. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో కేవలం రూపాయికే దహన సంస్కారాలు కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ రవీందర్ సింగ్ నిన్న ప్రారంభించారు. కరీంనగర్ లోని కట్టరాంపూర్ కు చెందిన మంచాల లలిత మరణించడంతో… ఒక రూపాయికే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె దహన సంస్కారాల్లో మేయర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు. ఆమె పాడె మోసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రూపాయికి రశీదు ఇవ్వడంతో పాటు.. పాడె కట్టడం దగ్గర్నుంచి డప్పు చప్పుల్లు, అంతిమయాత్ర, దహన సంస్కారాలు, ఇతర అన్ని కార్యక్రమాలను ఆచారాల ప్రకారం పూర్తిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే చేపడతారు. లలితకు కూడా రూపాయికే ఇవన్నీ అందించారు.

అది దైవ కార్యం.. మేయర్ రవీందర్ సింగ్

ఓ వ్యక్తి దహన సంస్కారాలు నిర్వహించడం అనేది దైవ కార్యం. అందుకే… ఆ దైవ కార్యంలో అందరం భాగస్వాములం అవ్వాలని… ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని వల్ల అంత్యక్రియలు చేయలేని పేదలకు చాలా మేలు జరుగుతుంది. దీని కోసం బల్దియా నుంచి 1.50 కోట్ల రూపాయలను కేటాయించాం. కులమత భేదం లేకుండా చనిపోయిన వారికెవరికైనా ఈ కార్యక్రమం కింద అంత్యక్రియలు నిర్వహిస్తాం.. అని మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news