పదహారేళ్లకే మోక్షజ్ఞానం అతడికే సాధ్యం..!

-

ఒక భారతీయ ఋషి.. అతడి చిన్ననాటి పేరు వెంకట్రామన్‌ అయ్యర్, తమిళనాడు తిరుచ్చుళిలోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. పదహారేళ్లకే మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు, అతనే రమణ మహర్షి. ఈ రోజు ఆయన 141 జయంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.

 

మహర్షి చాలా తక్కువగా ప్రసంగించేవాడు. ఆయన బోధనలలో ప్రధానమైంది ‘మౌనం’, ‘మౌనముద్ర’. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాటల ద్వారా మార్గం చూపేవాడు. ఎవరైనా ఉపదేశించమని అడిగితే ‘స్వీయ శోధన’ ఉత్తమమని, దీని ద్వారా మోక్షం సాధ్యమని బోధించేవాడు.అతని అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉండేది. ప్రసిద్ధ్ధ ఫ్రెంచ్‌ రచయిత సోమర్‌ సెట్‌ మామ్‌ మహర్షి గురించి ఓ వ్యాసాన్ని అద్భుతంగా రచించారు.

కుటుంబం..

శ్రీ రమణ మహర్షికి తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్‌ అయ్యర్‌. ఇతనిని భక్తులు భగవాన్‌ అని సంభోదించుకునేవారు. తమిళనాడులోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిసెంబర్‌ 30న జన్మించాడు.

బాల్యం..

పూర్వాశ్రమంలో రమణ మహర్షి అందరిలాగే ఉండి చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. సొంత ఊర్లో అంతగా విద్యాసౌకర్యం లేకపోవడంతో చిన్నాన్న సుబ్బాయ్యర్‌ వద్దకు వెళ్లి విద్యనభ్యసించాడు. బాల్యంలో మహర్షి నిద్ర ఆశ్చర్యానికి గురి చేసేది. నిద్రలో ఉన్నపుడే తోటి స్నేహితులు నడిపించుకుంటు తీసుకెళ్లినా గుర్తుండే కాదు. అసలు పేరు వేంకటేశ్వర.. ఓసారి స్కూల్లో తన పేరు రాయమంటే ‘వెంకట్రామన్‌’ అని రాయడంతో అప్పటి నుంచి ఆ పేరునే పిలిచేవారు.

మహర్షి బోధనలు..

స్వీయ శోధన ద్వారా మాత్రమే ‘జ్ఞాన మార్గం’. వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు, అద్వైత వేదాంతాలనే కాక అనేక మత సారాంశాలు మార్గాలను బోధించేవాడు.ఎప్పుడైతే మనసు నిలకడగా ఉన్న అనుభూతి ఇస్తోందో అది సమాధి అని.. నిలకడగా ప్రశాంతంగా ఉన్న మనసే దేవుడి నిజరూపాన్ని దర్శించగల్గుతుంది. అదే సహజమైన సమాధిగా భావించేవాడు. ఈ సమాధి స్థితిలో అంత్య దశలో పరమానందాన్ని పొందుతావు. భక్తిలో పరమానందం ముందుగా వస్తుంది. ఇది అశ్రుధారలాగా, రోమాలు నిక్కబొడుచుకుని, గొంతు తడబడుతూ బయటకు ప్రజ్వలిస్తుదని మహర్షి బోధించేవాడు.

Read more RELATED
Recommended to you

Latest news