ఈ అలవాట్లు మీకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే..
ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఐతే ఇప్పటి వరకు మీకున్న అలవాట్లు మంచివా కావా అని తెలుసుకోండి. కింద ఇవ్వబడ్డ అలవాట్లు మీకున్నట్లయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే లెక్క.
చక్కెర తక్కువ
భారతదేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అందుకే చక్కెర తక్కువ వాడాలి. రోజు వారి దినచర్యలో భాగంగా కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవద్దు. ఇప్పటికే మీరు ఈ నియమాన్ని పాటిస్తుంటే మీరు సూపర్.
జంక్ ఫుడ్
ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ అస్సలు ముట్టవద్దు. దీనివల్ల జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడిపోతుంటారు. అంతేకాదు అనారోగ్యం కూడా. మీకీ అలవాటు ఎప్పుడో కానీ లేదంటే మీ దారి సరిగ్గా ఉన్నట్టే.
చేప
చేపల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మీ ఆహారంలో చేప భాగమయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. సాల్మన్ వంటి చేప రకమైతే ఇంకా బాగుంటుంది.
నిద్ర
రోజంతా అలసిపోయిన శరీరానికి విశ్రాంతి అవసరం. రోజులో కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోతున్నారా? లేదంటే మీ ఆరోగ్యానికి ఇబ్బంది వాటిల్లే ప్రమాదంం ఉంది. ఎంత పనిచేసారన్నది ఎంత ముఖ్యమో శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే ముఖ్యం.
మంచినీళ్ళు
శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తీసుకుంటున్నారా. ముఖ్యంగా భోజనానికి ముందు నీళ్ళు తాగడం మంచిది. శరీరం వేడి చేయడానికి ముఖ్య కారణాల్లో నీటి శాతం తగ్గడమే ప్రథమం. అందుకే ఎప్పుడూ నీటి విషయంలో పొరపాట్లు చేయవద్దు.