భారత్ కి ప్రపంచ బ్యాంకు భారీ సాయం… ఎంతో తెలుసా…?

-

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇప్పుడు ఆర్ధికంగా నానా ఇబ్బందులు పడుతున్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కరోనా మీద పోరాడే విషయంలో దేశాలు అన్నీ కూడా ఇప్పుడు లాక్ డౌన్ ని ప్రకటిస్తున్నాయి. మన దేశం కూడా లాక్ డౌన్ ని ప్రకటించడం తో ఆర్ధిక ఇబ్బందులు వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ పరిణామం ఎంత మాత్రం మంచిది కాదు.

పేదలకు నష్టాలు రాకుండా చూసుకోవడమే కాకుండా చిన్నా మధ్యతరగతి పరిశ్రమలను ఆదుకోవాలి. లేకపోతే ఆకలి కేకలు అనేవి పెరిగే అవకాశం ఉంటది. ఈ నేపధ్యంలోనే మన దేశం భారీగా అప్పు చేయడానికి కూడా సిద్దమైంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు మన దేశానికి ఆర్ధిక సహాయం అందించడానికి, అదీ ఋణం రూపంలో అందించడానికి ప్రపంచ బ్యాంకు ముందుకి వచ్చింది. ఇందుకోసం భారీ ఋణం అందించింది.

ప్రపంచ బ్యాంక్ ప్రపంచ దేశాలకు ఆర్థిక సహాయం ప్రకటించింది. 25 దేశాలకు 1.9 బిలియన్‌ డాలర్ల సాయం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్ ఫండ్‌లో భాగంగా భారత్‌కు రూ.7600 కోట్ల(1 బిలియన్‌ డాలర్లు)ను ప్రపంచ బ్యాంకు కేటాయించింది. వరల్డ్ బ్యాంక్ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌క్యూటివ్‌ డైరెక్టర్స్‌ కీలక నిర్ణయం తీసుకుని సాయం చెయ్యాలని ముందుకి వచ్చారు.

స్క్రీనింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, లాబోరేటరీల ఏర్పాటు, డయాగ్నస్టిక్స్‌, పీపీఈల కొనుగోలు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు ప్రపంచ బ్యాంకు నిధులను వినియోగించనున్నారు. మన శత్రు దేశం పాకిస్తాన్‌ కు 200 మిలియన్‌ డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌కు 100 మిలియన్‌ డాలర్లు, మాల్దీవ్స్‌కు 7.3 మిలియన్‌ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news