‘మీ’ షో యాప్‌ ఫౌండర్‌ విదిత్‌ తెర వెనుక కథ..ఆ లాజిక్‌ పట్టుకునే సక్సస్‌ అయ్యారట..!

-

“మీ” షో యాప్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. వచ్చిన కొద్దికాలంలోనే కస్టమర్స్‌ను బాగా ఎట్రాక్ట్‌ చేసింది. ఇప్పుడు చాలామంది అమెజాన్, ఫ్రిప్‌కార్డ్‌ వంటి దిగ్గజ సంస్థలను కూడా పక్కన పెట్టి ‘మీ’ షోలోనే షాపింగ్‌ చేయటానికి ఇష్టపడుతున్నారు. దీనికి ముఖ్యకారణం..ఆ యాప్స్‌లో ఉండే సేమ్‌ ప్రొడక్ట్స్‌ హే ‘మీ’ షోలో తక్కవధరకు వచ్చేస్తున్నాయి. ఇంకా డెలివరీ ఛార్జెస్‌ కూడా ఉండవు. ఇలా విజయంసాధించాకే వారి గురించి చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ‘మీ’ షో అందరి ఫోన్లలోకి వెళ్లాక చాలామందికి యాప్‌ ఫౌండర్‌ ఎవరూ అనే ఆలోచన మొదలైంది. మీకు కూడా వచ్చే ఉంటుంది కదా..ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి..!

‘మీ’ షో ఫౌండర్‌ విదిత్‌ ఆత్రే. ఈ స్థాయికి వచ్చాడంటే అంత ఈజీగా ఏం రాలేదట..ఒకప్పుడు చదువుకునే రోజుల్లో… ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, దిల్లీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదువుకున్న విదిత్‌ ఆత్రే ‘ఫోర్ట్స్‌’ జాబితాలోని యువ సంపన్నుల గురించి ఆసక్తిగా తెలుసుకునేవాడు. ఇప్పుడు విదిత్‌ పవర్‌ఫుల్‌ ఫోర్బ్స్‌ ‘30 అండర్‌ 30’ ఏషియా జాబితాలోకి రాడానికి ఎంతో కాలం పట్టలేదు.

అలా మొదలైంది..

చదువు పూర్తయిన తరువాత విదిత్‌ మంచి ఉద్యోగాలే చేశాడుట. ఆ సమయంలోనే అతడికొక మంచి ఆలోచన వచ్చింది. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కోసం యాప్‌ మొదలుపెడితే ఎలా ఉంటుంది? అని. అయితే తన ఆలోచనకు పెద్దగా మద్దతు లభించలేదు. ‘చాలా కష్టం’ అన్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు.
విదిత్‌ స్నేహితుడు సంజీవ్ బర్నావాల్‌. తను కూడా విదిత్‌తో పాటే ‘ఫోర్బ్స్‌’ జాబితాలో చోటు సంపాదించాడు. కాస్త వెనక్కి వెళితే…తన చదువు పూర్తి అయిన తరువాత జపాన్‌లోని సోనీ కంపెనీలో మంచి ఉద్యోగం చేశాడు సంజీవ్‌.

ఇండియాలో ఉన్న విదిత్, జపాన్‌లో ఉన్న సంజీవ్‌ తమ ఆలోచనలను కలిసి పంచుకునేవారు. వారి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చిన తరువాత బెంగళూరులో హైపర్‌ లోకల్‌ ఫ్యాషన్‌ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌ ‘ఫ్యాష్‌నియర్‌తో రంగంలోకి దిగారు.తొలిరోజుల్లో తామే స్వయంగా కరపత్రాలు పంచినా, కస్టమర్ల దగ్గరకు వెళ్లి ‘మీరు కష్టపడి షాప్‌కు రావాల్సిన అవసరం లేదు. మా యాప్‌ విజిట్‌ చేస్తే చాలు’ అని చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదట. అలా ఫస్ట్‌ ఎంటంప్ట్‌ ఫ్లాప్‌ అయింది.

అలా అని వీళ్లిద్దరూ వెనక్కుతగ్గలేదు.. తమ పని గురించి సూక్ష్మంగా విశ్లేషించుకున్నారు. అప్పుడు వారికి అర్ధమైందేమిటంటే ఫ్యాషన్‌ మార్కెట్‌కు ఉండే ‘వైడ్‌రేంజ్‌ ఆప్షన్స్‌’ వల్ల తమ ప్రయత్నం విజయవంతం కాలేదని. అప్పుడే వారికి ఓ ఆలోచన వచ్చింది..వారి మైండ్‌లో చిన్నవాపారుల గురించి ఆలోచించారు. సాధారణంగా చిన్న వ్యాపారులకు సొంత వెబ్‌సైట్లు ఉండవు. అలా అని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌…లాంటి పెద్ద వేదికల దగ్గరికి వెళ్లలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాష్‌నియర్‌’కు శుభం కార్డు వేసి ‘మీ షో’(మేరీ షాప్‌–మై షాప్‌) యాప్‌ను డిజైన్‌ చేశారు. చిన్నవ్యాపారులకు ఇదొక అద్భుతమై మార్కెట్‌ ప్లేస్‌గా పేరు సంపాదించుకుంది.

తమ ప్రాడక్స్‌ను ప్రమోట్‌ చేయటానికి, వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సులభంగా షేర్‌ చేయడానికి, సులభంగా యూజ్‌ చేయడానికి ‘బెస్ట్‌’ అనిపించుకుంది మీ షో. డెలివరీ, మానిటైజ్‌ల ద్వారా సెల్లర్స్‌ నుంచి కమిషన్‌ తీసుకుంటుంది మీ షో. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రతి నెల సెల్లర్స్‌ సంఖ్య పెరుగుతుంది. చిన్న వ్యాపారుల కోసం ఏర్పాటయిన ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ పెద్ద విజయం సాధించింది. మన దేశంలోని లార్జెస్ట్‌ సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఒకటిగా నిలిచింది.విదిత్, సంజీవ్‌లను రైజింగ్‌స్టార్‌లుగా మార్చింది.

‘మీ’ షో లో డెలివరీ కాస్త లేటైనా మంచి నాణ్యతగల ప్రొడెక్ట్సే వస్తున్నాయని పలువురు వినియోగదారులు అంటున్నారు. అటు చిరువ్యాపారులకు, ఇటు కస్టమర్స్‌కి మధ్య వారధిలా మీ షో ఉపయోగపడుతుంది. మీ ఫోన్‌లో యాప్‌ లేకుంటే ఓ సారి వేసుకుని చూడండి..మీరే షాక్‌ అవుతారు. అదిరిపోయే వెస్ట్రన్‌ స్టైల్స్ మన బడ్జెట్‌లో వస్తుంటే ఇంకేం కావాలి.!

Read more RELATED
Recommended to you

Latest news