కొడాలి నానిని “అంకుశం”లో రామిరెడ్డిని సినిమా లో కొట్టినట్లు కొడతామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. రాజుపాలెం లో టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. అంబటి ,కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలుకు నిరసనగా రోడ్డు పై బైఠాయించాయి టీడీపీ శ్రేణులు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ… “అరేయ్ కుక్క …రోజు అమ్మాయిలను ఆఫీస్ కు రమ్మనే వెదవా …నీలాంటి నా కొడుకులు కూడా చంద్రబాబు గురించి మాట్లాడం ఏంటి ? అంటూ అంబటి పై నిప్పులు చెరిగారు.
టిడిపి శ్రేణులు అవమానాలకు పట్టుదల మార్చుకోవాలని.. కార్యకర్తలంతా రోడ్డు మీదకు వచ్చి పోరాటాలు చేయాలని పేర్కొన్నారు. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని… ఎవ్వరూ భయపడవద్దు ..అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నా కొడుకులను రాష్ట్రం నుంచి తరిమికొడదామని స్పష్టం చేశారు యరపతినేని శ్రీనివాసరావు. ఎవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ఇక నుంచి వైసీపీ నేతలకు బుద్ది చెప్పాలని తెలిపారు.