స్ఫూర్తి: అన్నదాతగా మారిన ఇంజినీరు.. లక్షల ఆదాయంతో స్పూర్తినిస్తూ…!

-

సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన మల్లికార్జున్ రెడ్డి అనుకోకుండా వ్యవసాయం రంగంలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అవార్డును కూడా అందుకున్నారు. అవార్డు పొందిన మొట్టమొదటి రైతుగా కూడా గుర్తింపు పొందారు.

నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయ్యి రైతుగా మారడం ఎన్నో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తోంది. యువతరానికి కూడా ఈయన ఆదర్శంగా నిలిచారు. తెలంగాణలోని పెద్ద కుర్మపల్లికి చెందిన మల్లికార్జున్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ లక్షల్లో జీవితాన్ని పొందుతూ హాయిగా ఉండేవారు. కానీ ఆ జీవితాన్ని వదిలేసి వ్యవసాయ రంగం లోకి అడుగుపెట్టారు.

దీనికి గల కారణం ఏమిటంటే వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన క్యాన్సర్ కారణంగా చనిపోవడం. ఈయన క్యాన్సర్ గురించి లోతుగా పరిశీలించారు. వ్యవసాయంలో అధిక దిగుబడి లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా పురుగుల మందులు వాడడంతో ఇబ్బందులు వస్తున్నాయని గ్రహించారు. ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఆయన గ్రహించారు.

అందుకని ఈయన సేంద్రియ వ్యవసాయంని ప్రారంభించారు. వాళ్ల పెద్దలు ఇచ్చిన 13 ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టారు. మెల్లమెల్లగా ప్రయోగాలు చేస్తూ తన యొక్క సాగును విస్తరించారు. పండ్లు, కొర్రలు, సజ్జలు, అల్లం, నువ్వులు ఇలా ఎన్నో పండించారు. 13 ఎకరాల తో పాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేశారు.

ఇలా ఏడాదికి 16 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆయన పొందుతున్నారు. అలానే చెరువులో ఆరు వందల చేపల పెంపకాన్ని చేపట్టి ఆక్వా కల్చర్ ను కూడా ప్రారంభించారు. నిజంగా అంత చదువుకుని వ్యవసాయం చేయడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చాలా మంది రైతులు ఈయనని ఆదర్శంగా తీసుకోవాలి. అలానే నేటితరం కూడా వ్యవసాయాన్ని చిన్న చూపు చూడకుండా ఇటువంటి గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news