మంచంపైనే ఉండి కోట్ల సంపాదన.. సంకల్పం గట్టిదైతే సిద్దిస్తుందంటున్న వ్యాపారి.!

-

రోడ్డుప్రమాదాలతో చాలామంది జీవితాలు చెల్లాచెదురై ఆర్థికంగా కుంగిపోతుంటారు. మరికొంతమంది ప్రాణాలు కోల్పోతారు. ఏదిఏమైనా…రోడ్డుప్రమాదాలు ఎంతో మంది జీవితాల్లో చీకటినే మిగులుస్తాయి. కానీ కేరళాలోని కాసరగడ్ జిల్లాకు చెందిన 47ఏళ్ల వ్యక్తి ఓ రోడ్డు ప్రమాదంలో మంచానికే పరిమితమయ్యాడు. అలా అని..తన జీవితాన్ని అక్కడితే ఆపేయలేదు. కోట్లవిలువైన కలప జిజినెస్ చేశాడు. ఇది ఎలా సాధ్యం అయిందంటే..

కేరళాకు చెందిన టీఏ షానవాస్ రోడ్డుప్రమాదంలో మంచానికే పరిమితమయ్యాడు. అయినా సరే తన ఎడమ చెవికి ఎయిర్ పాడ్ తగిలించుకుని బిజినెస్‌ను పర్యవేక్షించారు. కలపకు సంబంధించిన టింబర్ డిపోల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసుకొని, వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
కాసరగోడ్‌ జిల్లాలోని ఈస్ట్ ఎలేరి పరిధిలో ఉన్న కంబలోర్ టీఏ షానవాస్ స్వస్థలం. వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్న సమయంలోనే 2010, మే 6న అనుకోకుండా ఓ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించడంతో ఆయనకు స్పైనల్ కార్డ్ దెబ్బతిందని, ఆపరేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమని డాక్టర్లు వెల్లడించారు.

నాలుగు నెలల పాటు ఐసీయూలో మంచానికే పరిమితమయ్యారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆపరేషన్ చేసి ఆస్పత్రిలోనే 5 నెలలు ఉంచారు. ఆయన మెడ భాగంలో స్టీల్ రాడ్ వేయడంతో మెడ కొంచెం మాత్రం కదిలించడానికి వీలవుతోందని వైద్యులు తెలిపారు.

9 నెలల తర్వాత తన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని ఆయన ఆసుపత్రిలోనే నిర్ణయించుకున్నారు. తన భార్య సాయంతో ఓ లారీ కలప కొని వ్యాపారం తిరిగి ప్రారంభించారు. లాభాలు రావడంతో మరలా కలప కొని అమ్మడం ప్రారంభించారు. ఇలా వ్యాపారం మళ్లీ ఓ గాడిలో పడింది. అయితే ఇదంతా కూడా ఆయన మంచం మీది నుంచే పర్వవేక్షణ చేయటం విశేషం.

ఇప్పుడు షనవాస్ ఆఫ్రికా, మలేషియా, మాల్దీవుల నుంచి కూడా కలప తెప్పిస్తున్నారు. కేరళాలో భవన నిర్మాణాలకు అవసరమైన కలపను విక్రయిస్తున్నారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనం వాటిని స్వీకరించాలని అంటున్నారు షాన్‌వాస్‌. వ్యాపారం విజయవంతంగా కొనసాగించడంలో తన కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం ఎంతో ఉందని తెలిపారు. చాలామంది కష్టం రాగానే.. నా జీవితం ఇంతే, ఇక నావల్ల ఐతలే అనుకుని వదిలేస్తారు. ఎంత కష్టాన్ని అయినా సరే ధైర్యంగా ఎదుర్కున్నవారే..జీవితంలో విజయం సాధించగలరు అనటానికి షానవాస్ చక్కటి ఉదాహరణ.

Read more RELATED
Recommended to you

Latest news