అధ:పాతాళానికి తొక్కినా చంద్రబాబు వక్రబుద్ధి మారలేదు- విజయ సాయి రెడ్డి.

ఏపీలో వరదలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ వరద రాజకీయాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వైసీపీ.. టీడీపీల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ నష్టం సంభవించిందని విమర్శిస్తున్నారు. అయితే వైసీపీ కూడా టీడీపీకి కౌంటర్ ఇస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, చంద్రబాబు వ్యాఖ్యలపై తనదైన శైలిలో ట్విట్టర్ వేదిక స్పందించారు.

ysrcp mp vijayasai reddy

విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో … ’’భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపతికన సహాయ చర్యలు చేపట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు మాత్రం తాను మళ్ళీ సీఎం అయ్యాక బాధితులకు 25 లక్షల పరిహారం ఇస్తానంటున్నాడని.. గాల్లో కలిసిపోతారని సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి ‘మనిషివా చంద్రబాబు’ అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు‘‘ అంటూ విమర్శించారు.