అప్పుడు రూ. 8వేలకు కాల్‌ సెంటర్లో జాబ్‌..ఇప్పుడు బిలీనియర్‌..!

-

మన పుట్టుక మన చేతుల్లో ఉండదు. ఎలాంటి ఇంట్లో పుడతామో దేవుడే నిర్ణయిస్తాడు..కానీ మన జీవితం, ఎలా బతుకుతాము అనేది మాత్రమే మన చేతుల్లోనే ఉంటుంది. పుట్టినప్పటి స్థితికి చనిపోయినప్పటి స్థితికి మధ్యలో మనిషి చేసే పోరాటమే జీవితం. లైఫ్‌లో కష్టపడితే ఎంత పెద్ద స్థానాన్ని అయినా దక్కించుకోవచ్చని మన ప్రధాని మోదీని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది..జీరో నుంచి ఎదిగి హీరో అయిన వాళ్లు ఉన్నారు. ఎనిమిది వేల రూపాయలకు కాల్‌ సెంటర్లో పనిచేసిన ఓ వ్యక్తి నేడు కోట్లకు అధిపతి అయ్యాడు.. దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ బ్రోకరేజ్ సంస్థ యజమాని సక్సెస్ స్టోరీ ఈరోజు మీ కోసం..
నిఖిల్ కామత్ పరిచయం అక్కర్లేని పేరు.. 17 సంవత్సరాల వయస్సులో కాల్ సెంటర్‌లో మొదటిసారిగా ఉద్యోగం చేయడం మొదలు పెట్టారు. అప్పుడు నిఖిల్ కు నెలకు రూ. 8వేలు జీతం.. తన దగ్గర ఉన్న డబ్బులతో స్టాక్‌ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభించారు. ఒక సంవత్సరం తరువాత అతను ట్రేడింగ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పుడు, బిలియనీర్ అయిన నిఖిల్ కామత్ దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ బ్రోకరేజ్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు.
తన తండ్రి దాచుకున్న సొమ్ములో కొంతమొత్తాన్ని తనకు ఇచ్చి దీంతో వ్యాపారం మొదలు పెట్టమని చెప్పారని.. అప్పుడు తాను స్టాక్ ట్రేడింగ్‌ను ప్రారంభించానని నిఖిల్‌ చెప్పారు. అయితే తాను గుడ్డి విశ్వాసంతోనే జర్నీని మొదలు పెట్టినట్లు నిఖిల్ కామత్ అంటున్నారు.
అనంతరం కాల్ సెంటర్‌లోని తన మేనేజర్‌ని కూడా అలాగే చేయమని ఒప్పించాడు. “ఇది నిఖిల్ కామత్ కి మేలు చేసింది. ఆ మేనేజర్ ఇతరులకు చెప్పాడు… అలా ఒకరి నుంచి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం కొంతమందికి చేరుకుంది. దీంతో అందరి డబ్బులను నిఖిల్ నిర్వహించడం మొదలు పెట్టారు. మెల్లగా నిఖిల్ కామత్‌కు గుర్తింపు రావడం మొదలు అయింది. తర్వాత నిఖిల్ తన సోదరుడితో కలిసి కామత్ అసోసియేట్స్‌ను ప్రారంభించారు. అనంతరం 2010లో జెరోధాను ప్రారంభించారు. ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ బ్రోకరేజ్ సంస్థలలో జెరోధా ఒకటిగా ఎదిగింది.
అయితే చదువు మానేసిన కామత్‌కు డబ్బు సంపాదించడమే ఏకైక ప్రణాళిక. ఎందుకంటే నిఖిల్ సాధారణ, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. తన కజిన్‌లు MBA చదువుకున్నారు. దీంతో నిఖిల్ జీవితంలో ఏమి చేస్తాడు అంటూ కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఉండేదట.
స్కూల్ డ్రాపౌట్ నుండి, కాల్ సెంటర్‌లో పని చేయడం, జెరోధా , ట్రూ బెకన్ వరకు తన ప్రయాణంలో రెండు-మూడు విషయాలను గుర్తించానని నిఖిల్‌ చెప్పారు. తను బిలియనీర్‌గా మారడం వల్ల తన జీవితంలో ఎటువంటి మార్పులు లేవని చెప్పారు. తాను ఇప్పటికీ రోజులో 85 శాతం పని చేస్తున్నానని వెల్లడించారు. ఏ పని అయినా అప్పుడే పూర్తి చేయడం నిఖిల్‌కు అలవాటు. రేపు, ఎల్లుండి అని వాయిదాలు వేయడం తనకు తెలియదట. నిజంగా సక్సస్‌ అవ్వాలంటే..వాయిదా పద్ధతికి బాయ్‌ చెప్పాల్సిందే!

Read more RELATED
Recommended to you

Latest news