స్ఫూర్తి: పైలట్ అవ్వాలని అనుకున్నారు.. కానీ వ్యవసాయంలో ఆమె సక్సెస్ అయ్యి స్ఫూర్తినిస్తున్నారు..!

ఈ రోజుల్లో వ్యవసాయం అనేది కత్తిమీద సాములా మారింది. ఎంతో మంది రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎందరో మందికి వ్యవసాయంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ ఆఫ్రికా లోని యుగాండాకి చెందిన ఒక మహిళ మాత్రం విజయం సాధించింది. ఉగాండాకు చెందిన మహిళ గ్రేస్ ఓమురాన్‌ వాళ్లది వ్యవసాయ కుటుంబం.

 

women farmer in uganda

ఆమె మాత్రం పైలెట్ అవ్వాలని అనుకుంది. అదే ఆమె జీవిత ఆశయం కూడా. అనుకున్నట్లు ఆమె 2017లో ఈస్ట్ ఆఫ్రికన్ సివిల్ ఏవియేషన్ అకాడమీ లో శిక్షణ పొందింది. 2019 నాటికి క్యాడెట్ పైలెట్ గా బాధ్యతలు స్వీకరించింది. అయితే ఆమె కొంత కాలానికి ప్రెగ్నెంట్ అయింది సెలవు పెట్టి ప్రసవం కోసం ఇంటికి వచ్చింది.

ఆ సమయంలో ఖాళీగా ఉన్న తన తండ్రి వ్యవసాయ భూమిలో మామిడి, నారింజ మొదలైన పంటలను వేశారు ఇలా ఆమె వ్యాపారం మొదలుపెట్టారు. ఇంకేముంది దీనితో ఆమె నిర్ణయం మారిపోయింది. మొదటి రెండు ఎకరాల్లో మామిడి మొక్కలు పెంచింది.

ఇది బాగా ఉండడంతో 7 ఎకరాల్లో మామిడి, నారింజ, అవకాడో మొదలైన పండ్ల మొక్కలను వేశారు.
మంచి ఫలితం దీనిలో కూడా వచ్చింది. ఇంకేముంది పైలెట్ అవ్వాలనుకున్న తన కలల్ని పక్కన పెట్టి వ్యవసాయంతోనే ఆమె జీవితాన్ని సాగిస్తోంది. అదే విధంగా ఎంతో మందికి ఈమె ఆదర్శంగా నిలిచింది.