చేతులు కట్టుకు కూర్చోలేదు..ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకోం…బాలయ్య వార్నింగ్…!

నారా భువ‌నేష్వ‌రిపై వైసీపీ నేత‌లు చేసిన కామెంట్ల మీద ఎమ్మెల్యే బాల‌క్రిష్ణ స్పందించారు. మా ఆడ‌వాళ్ల జోలికి వ‌స్తే దేనికైతే అది..ప‌ర్స‌న‌ల్ గా టార్గెట్ చేస్తే ఊరుకోమని చెప్పారు. ఇష్యూల‌ను డైవ‌ర్ట్ చేయ‌డం కోసం ఏది ప‌డితే అది మాట్లాడ‌కూడ‌ద‌ని చెప్పారు. ఇష్యూల‌పై మాట్లాడాల‌ని వ్య‌క్తిగ‌తంగా వెల్ల‌కూడ‌ద‌ని అన్నారు. వైసీపీ వాళ్లు మాట్లాడే భాష చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని బాల‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ధైర్యంగా ఉండే చంద్ర‌బాబు క‌న్నీళ్లు పెట్టుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌రిగిన ప‌రిణామాలు చాలా బాధాక‌రం అంటూ బాల‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వైసీపీ వాళ్లు మాట్లాడుతున్న భాష నీచంగా ఉంద‌ని వాళ్ల‌ల్లో చ‌దువుకున్న‌వాళ్లు కూడా ఇలా మాట్లాడ‌టం దురదృష్ట‌క‌ర‌మ‌ని బాల‌య్య ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఇంత నీచ‌మైన సంస్కృతి చూస్తే అస‌హ్యం పుడుతుంద‌న్నారు. వైసీపీ వాళ్ల‌ను వాళ్ల ఇంట్లో ఆడ‌వాళ్లే అస‌హ్యించుకుంటున్నారంటూ బాల‌య్య మండిప‌డ్డారు. జ‌రుగుతున్న అరాచకాల‌కు జ‌న‌మే స‌మాధానం చెప్పాల‌ని బాల‌య్య వ్యాఖ్యానించారు. నోటితో కాదు ఓటుతో బుద్ది చెప్పాల‌ని అన్నారు.