పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం అనేది వాస్తవం. ఎవరికి అయినా సరే పట్టుదల ఉంటే ఏది అయినా సాధిస్తాం. ఈ ప్రపంచంలో అన్నీ అవయవాలు సక్రమంగా ఉన్న వాళ్లకు ఉండే పట్టుదల కంటే అవయవ లోపం ఉన్న వాళ్లకు ఉండే పట్టుదల అనేది ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. తమను తాము నిర్మించుకోవడానికి గాను, తమ జీవితాలను తాము మార్చుకోవడానికి గానూ వాళ్ళు తీవ్రంగా కష్టపడతారు.
తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే, మనని చూస్తే మనకే సిగ్గు వేస్తుంది. అవును నిజం… భారతీయ అటవీ శాఖా అధికారి సుశాంత నందా పంచుకున్న 17 సెకన్ల క్లిప్ చూస్తే పట్టుదల యెంత గొప్పదో అర్ధమవుతుంది. ఒక మైదానంలో ఒక కాలు లేని అథ్లెట్ ఫ్రంట్ ఫ్లిప్ హై జంప్ చేసిన విధానం ఇంటర్నెట్ ని ఫిదా చేసింది. “ఎవరైనా ఒకటి వదులుకోవడానికి ఇష్టపడకపోతే ఒక గొప్ప కథ అనేది జరుగుతుంది.”
అంటూ ఆయన పోస్ట్ చేసారు. ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. “మన మనస్సు మరియు హృదయాన్ని సాధించాలి ఆనుకున దానిపై ఉంచితే మనం సాధించగలిగేది ఆశ్చర్యంగా ఉంటుంది.” అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవ్వడంతో పాటుగా స్పూర్తిని ఇచ్చే వీడియో పోస్ట్ చేసిన నందా ను పలువురు అభినందిస్తున్నారు.
Every great story happened when someone decided not to give up?? pic.twitter.com/VLVGDlAbyl
— Susanta Nanda IFS (@susantananda3) February 6, 2020