ముంబై ఉబెర్ క్యాబ్ డ్రైవర్ చేసిన ఒక పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక ప్రయాణికుడుని పోలీసులకు అప్పగించిన తీరు ఆశ్చర్యపరిచింది. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో జుహు నుండి కుర్లాకు ఉబెర్ క్యాబ్ ను కవి బప్పడిట్టియ సర్కార్ తీసుకున్నారు. అయితే ఆయన తన ఫోన్ లో ఢిల్లీలోని షాహీన్ బాగ్ నిరసనలో పాల్గొంటున్న తన స్నేహితుడితో పౌరసత్వ సవరణ చట్ట౦ గురించి చర్చిస్తున్నారు.
లాల్ సలాం అనే నినాదంతో ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. దీనిని విన్న క్యాబ్ డ్రైవర్… పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వింటున్న డ్రైవర్, క్యాబ్ ఆపి, సర్కార్ కు తాను ఎటిఎం నుండి డబ్బు తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. డ్రైవర్ ఇద్దరు పోలీసులతో తిరిగి రావడం చూసి సర్కార్ షాక్ అయ్యారు. ఇక ఇదే సమయంలో… సర్కార్ ను పోలీసులు,
ఆయన చేతిలో ఉన్న “డాఫ్లి” (పెర్కషన్ వాయిద్యం) ఎందుకు తీసుకువెళుతున్నారని, మీ వివరాలు చెప్పాలని ప్రశ్నించారు. తాను జైపూర్ నుంచి వచ్చా అని, అంతకు ముందు రోజు నగరంలో జరిగిన సిఎఎ వ్యతిరేక “ముంబై బాగ్” నిరసనను చూడటానికి వచ్చా అని సర్కార్ వారికి చెప్పారు. “అతను కమ్యూనిస్టు అని చెప్తున్నాడని, దేశాన్ని తగలబెట్టడం మరియు ముంబైలో మరో షాహీన్ బాగ్ తయారు చేయడం గురించి మాట్లాడుతున్నాడు” అని డ్రైవర్ తన ప్రయాణీకుడిని అరెస్టు చేయాలని పోలీసులను కోరాడు.
ఆ సంభాషణ తాను ఫోన్ లో రికార్డ్ చేశా అని చెప్పాడు. దీనితో సర్కార్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవర్, అతని సంభాషణ వినమని… పోలీసులను కోరాడు. తాను ఎం అభ్యంతరకరంగా మాట్లాడాను అంటూ డ్రైవర్ ని సర్కార్ ప్రశ్నించగా… డ్రైవర్ అతనితో, “మీరు ప్రజలు దేశాన్ని నాశనం చేస్తారు మరియు మేము మిమ్మల్ని చూస్తూ కూర్చుంటామని మీరు ఆశిస్తున్నారా?…? అని ప్రశ్నించాడు.
“ఆ క్షణంలో నేను కలవరపడలేదు, కొంత భయం ఏర్పడింది మరియు రాత్రి అయిపోయింది అంటూ సర్కార్ వివరించారు. పోలీసులు అతనితో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. ఇద్దరి స్టేట్ మెంట్ ని పోలీసులు రికార్డ్ చేసారు. తెల్లవారుజామున ఒంటి గంటకు మరో కార్యకర్త ఎస్ గోహిల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని సర్కార్ ని విడిపించుకుని తీసుకు వెళ్ళాడు. వాతావరణం బాగా లేదు కాబట్టి ఎర్ర కండువాలు ధరించవద్దని ప్రజలకు సూచించారు.