నేను చేసిందే రైట్ అని నమ్మడమా? ఆనందంగా ఉండడమా.. ఏది సరైనదో తెలుసుకునేదెలా?

Join Our Community
follow manalokam on social media

నువ్వు చేసింది తప్పు అని ఎవరైనా చెప్పినపుడు మనకు కోపం రావడం సహజమే. కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని ఆ వ్యక్తి గురించి పరిపరి విధాల ఆలోచించి, మనసులోనే ఏవేవో ఊహలు ఊహించేసుకుని, మనసు తలపుల్లో ఆ మనిషిపై విజయం సాధించేసామని భ్రమపడి, అదీ చాలక అతనితో వాదించి, అందులో నెగ్గేలా వితండవాదం చేసి, అతను కూడా మీలాగే ఆలోచిస్తే, వాదన ముదిరి చివరికి ఎక్కడ లేని టెన్షన్ ని అనవసరమైన అనారోగ్యాలని తెచ్చిపెడుతుంది.

అంటే, ఎదుటి వారు ఏది చెప్పినా నమ్మేయాలని, వాళ్ళు చెప్పిన మాటలకే కట్టుబడి ఉండాలన్న ఉద్దేశ్యం కాదు. మనం ఏది చేసినా మన ఆనందం కోసమే. ఆనందం లేనపుడు ఏదీ చేయకూడదు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో కక్ష్య సాధింపు చర్యలకి పాల్పడి అసలు విషయం మర్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి.

అందుకే ఆనందం ముఖ్యం. మీరో విషయం చెప్పారు. అది ఎదుటివాళ్ళకి నచ్చలేదు. మీతో వాదించారు. మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. అయినా వినలేదు. మరొకరి ద్వారా చెప్పించే ప్రయత్నం చేసారు. అయినా వినలేదు. ఇంకెలా చెబితే అర్థం అవుతుందో ఆలోచించండి. అన్ని ప్రయత్నాలు చేసి, వీలు కాదనుకుంటే వదిలెయ్యండి. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు చెప్పింది కరెక్టే. కానీ అవతలి వాళ్ళు అది వినట్లేదు. దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి ఆనందంగా ఉండండి.

ఈ ప్రపంచంలో చాలా మందికి ఆనందం అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. పొద్దున్న లేస్తే లెక్కలేనన్ని టెన్షన్లు, ఆ టెన్షన్లతో పాటు అదనంగా బీపీలు ,షుగర్లు.. ఇంకా ముందుకెళితే ఎన్నో ఇబ్బందులు. వీటన్నింటి నడుమ నేను చెప్పిందే రైట్ అలాగే చేయాలనే మంకు పట్టు ఎందుకు? పట్టుకున్న ప్రతీదీ ఆనందం ఇవ్వకపోవచ్చు. కొన్ని సార్లు వదిలేస్తే కూడా ఆనందం దొరుకుతుంది.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...