మంచినీటి ఏటీఎంలతో పేదల దాహార్తిని తీరుస్తున్న మహిళ.!

-

అన్నదానం, పాతబట్టలు దానం చేసే వాళ్లను చూశారు కానీ.. నీటిని సాయం చేయడం మీరు ఎక్కడైనా చూశారు.. చలివేంద్రాల్లో సమ్మర్ నాలుగు రోజులు చేయడం కాదు.. ఎప్పుడూ మంచినీటిని ఉచితంగా అందించండి.. డబ్బులు తీయడానికి ఎలా అయితే ఏటీఎంలు ఉంటాయో.. అలా వాటర్ కోసం ఏటీఎంలు పెట్టి.. ఎంతో మంది దాహార్తిని తీరుస్తుంది కర్ణాటకు చెందిన చిన్మయూ ప్రవీణ్..

చిన్మయిది కర్ణాటకలో చిన్న పల్లెటూరు. వేసవి వస్తే ప్రజలు పడే నీటి కష్టాలు ఆమెను ఎప్పుడూ బాధపెట్టేవి. పెళ్లయ్యాక బెంగళూరు వచ్చింది. భర్త, పాప.. ఆనందంగా సాగే జీవితం. కానీ తనకు ఓ గృహిణిగానే మిగిలిపోవాలని అనిపించలేదు.. సమాజానికి ఏదైనా సాయం చేయాలనే తపన.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలనే ఆరాటం.. ఉండేది. అదే విషయాన్ని భర్త ప్రవీణ్‌తో పంచుకుంది. భర్త సహకరించాడు. అప్పుడే కలుషిత నీటితో జబ్బులకు గురవుతున్న వారి కథనాలను చూసింది.

వాళ్లకు ఏదైనా సాయం చేయాలని.. కొన్నాళ్లపాటు దగ్గర్లోని మురికివాడల వాళ్లకి ఉచితంగా తాగునీరు పంపిణీ చేసేవారట… బట్టలు లాంటివి అయితే.. ఓ సారి ఇచ్చేస్తే.. మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాటర్ అలా కాదు కదా..రోజూ నీటి అవసరం ఉంటుంది..అలా ఎన్ని రోజులని వెళ్లి ఉచితంగా వాటర్ ఇస్తాం అనుకుని..2019లో గెవిన్‌ వాచ్‌స్టమ్‌ (జర్మన్‌ భాషలో ఏ ఆటంకాల్లేకుండా ఎదుగు అనర్థం) పేరుతో సంస్థను ప్రారంభించింది..

దీని ద్వారా నామమాత్ర ధరకు మంచినీటిని అందివ్వాలనుకున్నారు.. ఈ ఆలోచనతో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులను కలిస్తే… బయోడేటాలో డిగ్రీ వరకూ తన మార్కులు చూసి చేతులెత్తేశారు. చిన్మయి ఒక సాధారణ స్టూడెంట్.. మార్కులు అంతంతమాత్రంగానే వచ్చేవి. ఇక అవకాశమెలా ఇస్తారు? అప్పుడే తన భర్త ప్రవీణ్.. సొంత ఖర్చుతో పుణె నుంచి యంత్రాలను తెప్పించి శ్రీరాంపురలో 24 గంటలూ అందుబాటులో ఉండే వాటర్‌ ఏటీఎం ఏర్పాటు చేశారు.

లీటర్‌ నీటికి 25 పైసలు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఏదైనా ఉన్నతంగా సాధించడానికి డిగ్రీలే ఉండనక్కర్లేదు… లక్ష్యం, దాన్ని చేరుకోవాలన్న తపన ఉండాలని చిన్మయి నిరూపించింది. యంత్రాల కోసం పుణె, జర్మనీ సంస్థలతో ఒప్పందం చేసుకుందీమె. చిన్న, మధ్యతరహా సంస్థల విభాగమూ సాయమందించడంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా ఈమె ఎటీఎంలు ప్రారంభమయ్యాయి.

16 జిల్లాల్లో 900 కుపైగా నీటి ఏటీఎంలు ఏర్పాటు చేసింది. ఏడు దశల్లో శుభ్రత, రోజంతా నీరు అందుబాటులో ఉండటం, సమస్య వస్తే వెంటనే సాయమందించేలా కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌.. ఈ సంస్థ ప్రత్యేకత. వీటిల్లో మహిళలకే ఎక్కువ అవకాశాలిచ్చింది.. నిర్వహణ నుంచి సర్వీసింగ్‌ వరకు పూర్తిగా ఆడవాళ్లే చూసుకునే ప్లాంట్లూ ఉన్నాయి.

ప్రతి బుధవారం ఉచితంగా అందిస్తుంది. త్వరలో దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ మూడేళ్లలో ఉత్తమ వ్యాపారవేత్త సహా ఎన్నో అవార్డులనూ అందుకుంది. విస్తారా ఫౌండేషన్‌ని స్థాపించి… చదువు మానేసిన పిల్లలని తిరిగి బడుల్లో చేరుస్తూ, నీటి వినియోగంపై చైతన్యం తెస్తున్నారు. పిల్లల్లో సామాజిక నైపుణ్యాలపై శిక్షణన్వివడంతోపాటు మానసిక ఆరోగ్యంపైనా అవగాహన కల్పిస్తోంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news