27వ తేదీన నెక్లెస్ రోడ్ లో యోగ కార్యక్రమం ప్రారంభిస్తామని… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. యోగ మహోత్సవ్ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం…200 దేశాల ప్రభుత్వాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నాయి, ఆయా దేశాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. మోడీ చొరవతో ఐక్యరాజ్య సమితి అంగీకరించేలా చేసి ఇంటర్నేషనల్ యోగ డే గా నిర్వహిస్తున్నాం..ప్రపంచంలోని అనేక దేశాలు మన దగ్గరకి వచ్చి యోగ నేర్చుకుంటున్నాయన్నారు.
ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరుపున 75 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం.. స్వాత్యంత్రం వచ్చి 75ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా 75 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా 75ప్రాంతాల్లో యోగ డే నిర్వహించాలి.. ఆస్ట్రేలియా, అమెరికా కూడా మనకు స్వాత్యంత్రం వచ్చిన సందర్భాల్లో వారి దేశంలోని 75ప్రాంతాల్లో యోగ డే నిర్వహిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ లో 25రోజుల కౌంట్ డౌన్ ని 27తేదీన ప్రారంభిస్తాం.. యోగ ప్రతి వ్యక్తి జీవితంలో భాగంగా చేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి.