సంతోషం మనిషికి కావాల్సింది. ఇంకా చెప్పాలంటే అది అందరి హక్కు. ఒకరిని బాధపెట్టడానికి ఎవరికీ హక్కు లేదు. చాలామంది ఆ విషయం తెలిసి కూడా బాధపెట్టడానికి రెడీగా ఉంటారు. కొందరు బాధపడడానికీ రెడీ అవుతారు. నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు కొందరిని వదిలి దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కొందరెవరో ఎలాంటివారో ఇక్కడ తెలుసుకుందాం.
అహం
నేనే గొప్ప. నేను చెప్పిందే కరెక్ట్ అని తమ తప్పుల్ని ఒప్పుకోని వారితో స్నేహం మానేయండి. ఎప్పుడూ మీదే తప్పుగా చూపుతూ మీ మీద మీకు చిన్నచూపు కలిగేలా చేయడంలో వీరు ముందుంటారు. ఇలాంటి వాళ్ళతో దోస్తీ ఎప్పటికీ మంచిది కాదు.
చంచల స్వభావం గల వారికి
ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ ఒక పనిలో ముందుకి వెళ్ళలేక తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఉండేవారితో స్నేహం పెట్టుకోవద్దు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చంపడంలో వీరు సిద్ధహస్తులు.
పైశాచిక స్వభావం గల వారికి
అవతలి వారికి చెడు చేయడం ద్వారా సంతోషాన్ని వెతుక్కునే వారితో దూరంగా ఉండండి. వారెప్పుడూ అవతలి వారు చెడుగా అవ్వాలనే కోరుకుంటారు. అందులో మీరు కూడా ఉంటారన్న విషయం మర్చిపోవద్దు.
ఆడవాళ్ళని చులకనగా చూసేవారితో
అమ్మాయిల మీద తప్పుడు అభిప్రాయం ఉండి, వారి మీద కామెంట్లు కొడుతూ ఉండేవారితో స్నేహం మానేయండి. మీ మనసుని పాడుచేయడంలో వీరు ముందుంటారు. మనుషులని మనుషులుగా చూడడం వీరికి రాదు. తక్కువ ఎక్కువల మధ్య వీరెప్పుడూ ఎక్కువ అనే ఫీల్ అవుతూ ఉంటారు.
ప్రవర్తన బాగాలేదని తెలిసినపుడు
అవతలి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని, అవి మీకు హానికరంగా అనిపించినపుడు వెంటనే వారికి దూరం అవ్వండి. అబద్ధాలు చెప్పేవారు మీకెన్ని చెప్పినా మరో అబద్ధం చెబుతున్నట్టుగానే అనిపిస్తుంది.