
1980… అంటే 38 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అంటే ఫేస్ బుక్, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, టెక్నాలజీ.. ఇలా ఆ టైమ్ లో ఇవేమీ లేవు. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా మద్రాసులోనే ఉండేది. 1980లో జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వేడుకకు జయలలిత, జెమినీ గణేషన్, శోభన్ బాబు, రాధిక, జయసుధ, కమల్ హాసన్ లాంటి మహామహులు హాజరయ్యారు. వాళ్లు ఎంత సింపుల్ గా ఉన్నారో.. ఆ అవార్డ్స్ ఫంక్షన్ ఎలా జరిగిందో మీరే ఈ వీడియోలో చూడండి.